ముస్లిం లను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు లేదు

news02 June 18, 2018, 10:34 p.m. political

Utham bus Yatra

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ డిల్లీ పర్యటనలో స్వంత ప్రయోజనాలే తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని ఆరోపించారు.ముస్లిమ్స్ .. గిరిజన రిజర్వేషన్స్ అంశాన్ని ప్రధాని మోడీ వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ముస్లిమ్స్ .. గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థమౌతోందని విమర్శించారు. ప్రధానితో 12 శాతం రిజర్వేషన్స్ అంశాన్ని ఎందుకు ప్రధానితో మాట్లాడలేదో ముస్లిమ్స్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

Cm KCR meets pm modi

మోడీతో మాట్లాడే ధైర్యం కేసీఆర్ కు లేదా .. లేక మోడీ అంటే జంకు తున్నాడా అని సెటైర్ వేశారు. ముస్లిమ్స్ కు కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ ముస్లిమ్స్ ఓట్లు అడిగే నైతికత కోల్పోయారని అన్నారు ఉత్తమ్.ముస్లిమ్స్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. కేసీఆర్ కు మోడీతో రహస్య ఒప్పందం ఉందని అన్నారు. అందుకే రాష్ట్రపతి .. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరటు మద్దతు ఇచ్చారని చెప్పారు. నోట్లరద్దు .. జీఎస్టీ లో బేషరతుగా మద్దతిచ్చారని గుర్తు చేశారు.

Utham kumar Reddy

మోడీనినిలదీస్తామని .. కడిగి పారేస్తానని .. మెడలువంచి తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టిస్తానన్న కేసీఆర్ మాటలు ఏమైయ్యాయని ప్రశ్నించారు.కేసీఆర్ చర్యలవల్ల తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతోందని అన్నారు.తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలిపోతంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు స్పష్టం చేశారు.2019 ఎన్నికల్లో ప్రత్యేక ప్రణాలికతో ముందుకెలుతున్నట్లు చెప్పారు.పీసీసీ పదవుల పై తను ఎలాంటి ప్రతిపాదనలు హైకమాండ్ కు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పాటుగానే తెలంగాణ కు కూడా పదవుల నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు పై కూడా సర్వే జరుగుతోందని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ట్ కు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్స్ ఎంపికపై వస్తున్న ఫిర్యాదులపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు .. సీఎం కు పార్టీ పరంగా లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి

tags: Utham kumar Reddy, gandhibavan, Rahul Gandhi, tpcc chief, Mallu Ravi, cm KCR Delhi tour, pm Narendra Modi, president utham , Telangana panchayath elections schedule, PCC chief, minarty reservation, 12 percent reservations, Telangana reservations.

Related Post