నన్ను టీఆర్ ఎస్ నేతలే ఓడించారు

news02 July 9, 2019, 1:56 p.m. political

somarapu

తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నాయకుడు సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సోమారపు సత్యనారాయణతోపాటు మాజీ కార్పోరేటర్లు పలువురు పార్టీకి  రాజీనామా లేఖలు సమర్పించారు. గత అసెంబ్లీఎన్నికల్లో రామగుండం నియోజవర్గం నుంచి పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోమారపు సత్యనారాయణ తన అనుచరులతో చర్చించాక రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తాను అడగకుండానే సీఎం కేసీఆర్ గతంలో తనకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారని ఈ సందర్బంగా సత్యనారాయణ చెప్పారు. ఐతే ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఏ మాత్రం లేకుండా పోయిందని అన్నారు. చివరకు పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని సోమారపు సత్యనారాయణ వాపోయారు. ఇక మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే పనిగట్టుకుని తనను ఓడించారని ఆయన ఆరోపించారు. మొత్తానికి సోమారపు సత్యనారాయణ రాజీనామా చేయడంతో టీఆర్ ఎస్ అధినాయకత్వం షాక్ కు గురైంది.

 

tags: somarapu sathyanarayana, trs leader somarapu sathyanarayana, somarapu sathyanarayana resigned, somarapu sathyanarayana resigned to trs

Related Post