నోరు జారీతే వేటే..

news02 Jan. 7, 2019, 7:57 a.m. political

/rahul_gandhi_on_ex_mp_sarvey_sathyanarayana

హైదరాబాద్- కాంగ్రెస్ లో ట్రెండ్ మారిందా..? పార్టీలో అడ్డుగోలుగ మాట్లాడే కాలం చెల్లిందా..? పార్టీ క‌ట్టుదాటితే.. ఎంత‌టి నేత‌నై వేటు త‌ప్ప‌దా..? అంటే అవునంటున్నాయి పార్టీలో జ‌రుగుతున్న‌ ప‌రిణామాలు. పార్టీ ఓట‌మిపై జ‌రుగుతున్న‌స‌మీక్ష‌ల సంధ‌ర్బంగా .. మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్యానారాయ‌ణ రెచ్చి పోవ‌డం.. అంతే స్పీడ్ గా స‌ర్వేను స‌స్పెండ్ చేయ‌డం ఇప్పుడు పార్టీ న్యూ ట్రెండ్ కు అద్దం ప‌డుతుంద‌ని అంటున్నాయి పార్టీ వర్గాలు.

ఇంత‌కు స‌ర్వేపై వేటు ఎందుకు ప‌డింది..? దీనితో పార్టీ లీడర్ల‌కు హైకమాండ్ ఇచ్చిన మేసేజ్ ఏంటో..? ఓసారీ ప‌రీశీలిస్తే.. ఆదివారం గాందిభ‌వ‌న్ లో మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంపై స‌మీక్ష జ‌రుగుతున్న‌స‌మ‌యంలో.. స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌.. త‌న నోటికి ప‌నిచెప్పారు. స‌హ‌జంగానే ..మీటింగ్  ల‌లో త‌న నోటికి ప‌ని చెప్ప‌డం స‌ర్వేకు అల‌వాటు. స‌ర్వే మాట్లాడుతుండ‌గ‌.. ఏం చెప్పాల‌న్నా తోటి నేత‌లు జంక‌డం.. ప‌రిపాటే.ఎందుకంటే.. స‌ర్వే నేను ద‌ళితుడిని కాబ‌ట్టే క‌దా.. అంటు టార్గెట్ చేసే విధానానికి భ‌య‌ప‌డ‌టం.. చాలాసార్లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే .

/sarvey_sathyanaraya,shock

అయితే అస‌లు విష‌యానికి వ‌స్తే.. స‌మీక్ష‌లో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై మాట్లాడ‌కుండా.. స‌ర్వే వ్య‌క్తిగ‌త ఆరోఫ‌ణ‌ల‌కు దిగారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాను, పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ ను ఉధ్దేశించి.. దుర్భాష‌లు ఆడారు.ముఖ్యంగా కుంతియా ను ఉద్దేశించి..  అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో  .. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రిలు బొల్లు కిష‌న్, మ‌హేష్ కుమార్ గౌడ్..  ఇది స‌రికాదు అని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డంతో.. ఆగ్ర‌హంతో ఊగిపోయిన స‌ర్వే.. వారిని బూతులు తిడుతూ.. కిషన్ పైదాడికి దిగ‌డంతో.. స‌మావేశం ఉద్రిక్తంగా మారింది. వారించే ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌తి ఒక్క‌రిని స‌ర్వే దుర్భాష‌లు ఆడుతూ.. స‌మావేశం నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఈ ప‌రిణామాల‌ను సీరియ‌స్ గా తీసుకుంది. ఏకంగా పార్టీ ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్య‌ద‌ర్శ‌లు, పీసీసీ ఛీఫ్ , వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ లు ఇలా ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా.. స‌ర్వే రెచ్చిపోయి తిట్ల‌దండ‌కం చ‌ద‌వ‌డం.. అంతేకాదు.. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలు. బొల్లు కిష‌న్ , మ‌హేష్ కుమార్ ల‌పై  దాడికి పాల్ప‌డటాన్ని సీరియ‌స్ గ భావించిన పార్టీ హైక‌మాండ్ ... స‌ర్వేను వెంట‌నే  పార్టీ నుండి స‌స్పెండ్ చేసింది.

rahul_gandhi_seroius

అయితే సీనియ‌ర్ నేత‌గా ఉన్న‌ స‌ర్వే పై గంట వ్య‌వ‌దిలో సస్పెండ్ చేయ‌డం..పార్టీలో మారుతున్న‌ట్రెండ్ కు అద్దం ప‌డుతుంద‌ని అంటున్నారు నేత‌లు. గ‌తంలో మాదిరి .. పార్టీలో ఉంటూ..ఎవ‌రినైనా ఏమైనా అంటాం.. అంటే ఇక కుద‌ర‌దు అన్న గ‌ట్టి సంకేతాన్ని ఇచ్చింద‌ని అంటున్నారు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌న దాటితే.. ఎంత పెద్ద లీడ్ అయిన‌.. ఉపేక్షించ‌ద‌న్న మేసేజ్ ను నాయ‌కుల‌కు ఇచ్చేందుకు  స‌ర్వేపై స‌స్పెండ్ నిర్ణ‌యం తీసుకుంద‌ని టాక్. దీనిని బ‌ట్టి..ఏతా వాత అర్థం అవుతున్న‌దేమిటి అంటే.. మేము సీనియ‌ర్లం.. పార్టీలో తోపులం.. మా ఇష్టం వ‌చ్చిన‌ట్లు అంటాం.. చేస్తాం.. అంటే కుద‌ర‌ద‌ని.. చెప్పేందుకే పార్టీ స‌ర్వే పై వేటు ద్వారా చెప్పంద‌ని అంటున్నారు. సో.. ఇప్ప‌డికైనా..త‌మ నోటిని బ‌ద్రం పెట్టుకోకపోతే.. ఎవ‌రిపైనానా వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారిచేసింది అదిష్టానం.సో.. బీకేర్ ఫుల్ లీడ‌ర్స్.

tags: rahul gandhi, uttham kumar reddy, tpcc cheif,rc kunthia, congress reviews,ex mp sarvey satyhanarayana, suspension, gandhibhavan, congress leaders fighting, rahul gandhi serious

Related Post