తాజా పరిణామాలపై చర్చ

news02 Feb. 5, 2019, 2:22 p.m. political

rahul

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమావేశం అయ్యారు. విదేశాల నుంచి సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ప్రియాంక తుగ్లక్‌ రోడ్డులోని రాహుల్‌ నివాసానికి చేరుకుని చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు ముథ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ పశ్చిమ విభాగం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌, సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇక ప్రియాంక గాంధీ రాకతో ఇప్పటికే సిద్ధం చేసుకున్నపార్టీ ప్రచార ప్రణాళికలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం పదమూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలనుకున్న పార్టీ ఆ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఉత్తరప్రదేశ్‌ తూర్పు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రియాంక రాకతో పార్టీలో నూతనోత్సాహం కన్పిస్తోంది. ప్రధఆనంగా యూపీ క్యాడర్ లో కొత్త జోష్ ఉట్టిపడుతోంది.

tags: rahul, rahul gandhi, rahul mwwt priyanka, priyanka gandhi meet rahul, rahul gandhi meeting with priyanka

Related Post