ప్రియాంక గాంధీ రోడ్ షో

news02 Feb. 12, 2019, 7:13 a.m. political

priyanka

ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో లఖ్‌నవూలో రోడ్‌ షో నిర్వహించారు. సోదరుడు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక ఈ రోడ్‌ షో నిర్వహించింది. ఎంతో ఉత్సాహంతో బస్సుపైన నిలబడి ప్రియాంక ప్రజలకు అభివాదం చేశారు. ఈ రోడ్‌షోలో జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్‌ నేతలతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు మొత్తం 25 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది.

priyanka 

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించారు రాహూల్ గాంధీ. ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కంచుకోటలుగా చెప్పుకొనే స్థానాలున్నాయి. వాటిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు కీలకమైనవి. ఆయా నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ మేరకు రోడ్ షోలు, భహిరంగ సభలు, అంతర్గత సమావేశాలకు ప్రియాంక గాంధీ ప్లాన్ చేస్తున్నారు.

tags: priyanka, priyanka gandhi, priyanka gandhi wadra, priyanka gandhi political entry, priyanka gandhi aicc general secretary, priyanka gandhi up general secretary, priyanka road show, priyanka gandhi road show

Related Post