మధ్యలోనే పారిపోయిన కేసీఆర్..

news02 Nov. 3, 2018, 7:27 a.m. political

babu

రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జేట్ తో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ అప్పులు పాలు చేశాడు.. హైదరాబాద్ ను బంగారు మయం చేసిస్తే.. కేసీఆర్ పాలించలేక పారిపోయాడు.. ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 16వేల కోట్ల రూపాయవ మిగులు బడ్జెట్ తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. కేసీఆర్ అసమర్ధతో తెలంగాణను ఇప్పుడు అప్పుల పాలు చేశారని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్.. తన కుటుంబ సంక్షేమాన్ని మాత్రం చూసుకున్నారని విమర్శించారు. 

chandra babu

ఇక హైదరాబాద్ ను బంగారు మయం చేసిస్తే కేసీఆర్ మాత్రం పాలించలేక పారిపోయారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలించేందుకు టీఆర్ ఎస్ కు అధికారం కట్టబెడితే.. కేసీఆర్ మాత్రం చేతకాక పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటే.. కేంద్రంపై పోరాటి నిధులు సాధించుకోవచ్చని తాను భావిస్తే.. కేసీఆర్ మాత్రం ప్రజల గురించి ఏనాడు పట్టించుకోకుండా.. ఏపీతో పేచీలు పెట్టుకుని తెలంగాణ అభివృద్దిని విస్మరించారని విమర్శించారు. కేవలం తన కుటుంబం బాగుపడితే చాలాని కేసీఆర్ భావించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

tags: chandra babu, babu, babu fire on kcr, chandra babu fire on kcr, chandra babu fire on cm kcr, chandra babu about kcr, cm chandra babu fire on kcr

Related Post