కిమ్ జాంగ్ కిరాతక శిక్షలు

news02 June 12, 2019, 10:29 a.m. political

Kim Jong

న్యూ ఢిల్లీ : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కిరాతకపు ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. వియత్నాంలో ఇటీవల అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యానికి బాధ్యులుగా చేస్తూ ఐదుగురు అధికారులను ఉత్తర కొరియా శిక్షించిందని వార్తలు వచ్చాయి. వీరిలో అమెరికా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యోక్ చోల్ ఉన్నారు. కిమ్ వారిని అత్యంత కిరాతకంగా చంపినట్లు ద స్టార్ పత్రికలో వచ్చిన వార్త పెద్ద సంచలనం రేపుతోంది. అధికారులకు శిక్ష విధించడం కోసం కిమ్ బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా ఫిరాన్హా అనే రాకాసి చేపలను వందల సంఖ్యలో దిగుమతి చేసుకున్నాడు. వాటిని ప్రత్యేక ట్యాంకుల్లో పెంచుతున్నాడు. అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తన ముఖ్య అనుచరులు, జనరల్ స్థాయి అధికారుల చేతులను నరికించాడు. అనంతరం బతికుండగానే వారిని ఫిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు. ఉత్తర కొరియాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు రహస్యంగా చేరవేసిన కారణంగానే ఆ అధికారులకు శిక్ష విధించాలని కిమ్ ఆదేశించారని తెలిసింది.

Kim Jong

1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా ద స్పై హు లవ్స్ మీ స్ఫూర్తితో ఈ చేపలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సినిమాలో విలన్ కర్ల్ స్ట్రామ్‌బర్గ్ తన శత్రువులను షార్కు చేపలతో నిండివున్న ఆక్వారియంలో పడేసి దారుణంగా చంపేస్తాడు. ఆ సీన్ కిమ్‌కు బాగా నచ్చడంతో ఫిరాన్హా చేపలను పెంచుతున్నాడు. ఈ శిక్షలే కాకుండా.. కిమ్ ఒక్కోసారి పులులకు మనుషులను ఆహారంగా వేస్తాడని, తలలు నరికించడం, సజీవంగా దహనం చేయడం వంటి శిక్షలు అమలు చేయడం కిమ్ కు అలవాటు.

Kim Jong

tags: Kim Jong,Uttara Koriya, America, India, Japan,Fishes,Uttara Koriya Army

Related Post