తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు

news02 March 29, 2019, 7:21 a.m. political

 

హైదరాబాద్ : మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల నోరు పారేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తనకు ఓట్లు వేయకుండా ఒడించినట్లు. ఇప్పుడు నామా ను కూడా ఒడిస్తే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకో వని అన్నారు. పాలేరు లో కాంగ్రెస్ కు మీరు వేసిన ఓట్లు మురిగి.. మురుగు కాల్వలో Thummala nageswar Rao controversy comments కొట్టుకు పోయాయనీ ఓటర్లనుద్దేశించి అన్నారు. నాకు జరిగినట్లు నామా గారికి జరిగితే కుక్కలు కూడా మిమ్మల్ని చూడవనీ వార్నింగ్ ఇచ్చారు తుమ్మల. తన ఓటమి..35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత చిన్నతనంగా అనిపిస్తోందని అన్నారు.జరిగిన పొరపాట్లు మరిచి నామాను గెలిపించాలన్న తుమ్మల.. ఎంత అభివృద్ధి చేసినా కొంచెం కూడా ఖమ్మం జిల్లా ప్రజలు కృతజ్ఞతలు చూపలేదనీ అన్నారు. 

 

ఎన్నికల వేళ తుమ్మల ఇలాంటి కామెంట్స్ చేయటం సంచలనంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నోటిరురుసుతోనే అక్కడి జనం తుమ్మలను ఓడించారు. 16 ఎంపి సీట్లు గెలుస్తాం అని చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ.. ఖమ్మతోనే అపజయం ముటకట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నామా ను ఓడించేందుకు సొంత పార్టీ నేత లే కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. అందరూ మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు తుమ్మల ఇలాంటి కామెంట్స్ చేయటం తో అంతా అయిపోయిందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి

tags: Thummala constricts comments, Nama nageswar Rao campaign, Nama joined in Trs, Nama nageswar Rao controversy comments, khammam MP, renukha Chowdary.

Related Post