ప్రత్యేకంగా గల్ఫ్ మేనిఫెస్టో..

news02 Nov. 9, 2018, 7:02 p.m. political

uttam

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఓ వైపు మహాకూటమి సీట్ల సర్దుబాటులో తనముకలవుతూనే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. దుబాయ్ లోని వసల కార్మికులు, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ వాసులతో ఉత్తమ్ టీం సమావేశం అవుతోంది. దుబాయ్ సోనాపుర్ లోని కార్మిక శిబిరాల్లో తెలంగాణ కార్మికులతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించి.. కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవశ్యకతను కార్మికులకు తెలిపారు.

uttam 

విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా గల్ఫ్ మ్యానిఫెస్టోను రూపొందంచింది. దీంట్లో గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలను పొందుపరిచారు. కార్మికులతో పాటు స్వఛ్చంద సంస్థలు, పలు తెలంగాణ సంఘాల ప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీం ప్రత్యేకంగా సమావేశం అయ్యిుది. అరుల త్యాగాలతో పోరాడి తెచ్చుకున్న.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ను అభివృద్ది చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న అంశాన్ని వారికి వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దుబాయ్ పర్యటలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. షబ్బీర్ ఆలి, ఆర్సీ కుంతియా, మధుయాష్కి గౌడ్ తదితరులు ఉన్నారు.

tags: uttam, pcc chief uttam, uttam kumar reddy, uttam dubai tour, uttam kumar reddy dubai tour, uttam meet labour in dubai, uttam meet telangana people in dubai

Related Post