కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్

news02 July 10, 2019, 8:40 p.m. political

rahul

సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. చాలా సందర్భాల్లో రాహూల్ తన అభిప్రాయాలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేధికైన ట్విటర్‌లో రాహూల్ గాంధీ ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. ఈ నేపధ్యంలో ఆయన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటి మంది ట్విటర్‌ అనుచరులారా.. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు, ఈ మైలురాయిని ఈరోజు అమేఠీలో నేను కలవబోతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల మధ్య సెలబ్రేట్‌ చేసుకుంటానని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మొన్న ఏఐసిసి అధ్యక్ష్య పదవికి రాజీనామా చేసిన తరువాత రాహూల్ గాంధీ తన ట్విటర్‌ ఖాతా బయో నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించి కాంగ్రెస్ కార్యకర్త అని చేర్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి రాహుల్‌ గాంధీ అమేఠీలో పర్యటించారు. 

 

tags: rahul, rahul gandhi, rahul thanks to twitter fallowers, rahul reached one crore twitter fallowers, rahul gandhi reached one crore twitter fallowers

Related Post