ముంద‌స్తుకు కెప్టెన్ ద్విముఖ వ్యూహం

news02 June 26, 2018, 12:56 p.m. political

uttam skech
హైద‌రాబాద్ : ముంద‌స్తు ఎన్నిక‌లకు పీసీసీ ఛీప్ ఉత్త‌మ్  రెఢీ అవుతున్నారా.. విక్ట‌రీ కొట్టేందుకు కెప్టెన్ ప‌క్కా ప్లాన్‌కు ఇప్ప‌టి నుండే శ్రీకారం చుట్టారా..అవును. గ‌తంలో చేజారిన విజ‌యాన్నిస్వంతం చేసుకునేందుకు ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకెతున్నారు.  హైక‌మాండ్ అండదండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ఉత్త‌మ్, ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్‌లో ప‌ని మొద‌లు పెడ‌తున్నారు. ఇప్ప‌డి నుండే పార్టీని గ్రౌండ్‌లో ప‌రుగులు పెట్టిస్తేనే.. ఎన్నిక‌ల్లో విక్ట‌రీ కొట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్న ఉత్త‌మ్..దాని క‌నుగుణంగా.. నేత‌ల‌ను సిద్దం చేస్తున్నారు.

uttam,kuntiya

దీనిలో భాగంగా మొద‌ట పార్టీలో నెల‌కొన్న అసంతృప్తుల‌కు బ్రేకులు వేస్తున్నారు ఉత్త‌మ్. దీనిపై ఇప్ప‌డికే అధిష్టానంతో మాట్లాడిన ఉత్త‌మ్.. రాష్ట్రంలో త‌న‌కు, త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌కొద్ది మంది నేత‌ల‌కు కార‌ణ‌మైన అంశాల‌పై దృష్టిపెట్టారు. ముఖ్యంగా ఇత‌ర పార్టీల నేత‌ల చేరిక‌ల అంశంలోనే త‌న‌ను కొంద‌రు కావాల‌ని బ‌ద్నామ్ చేస్తున్నార‌ని భావిస్తున్న కెప్టెన్.. దీనికి బ్రేకులు వేయాల‌ని డిసైడ్ అయ్యారు. దీనికోసం తన అధ్య‌క్ష‌త‌న జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహాలతో క‌లిసి క‌మిటీ వేయాల‌ని భావిస్తున్నారు. ఈక‌మిటీ చేరికల స‌మ‌యంలో అక్క‌డి స్థానిక నేత‌ల‌తో మాట్లాడిన త‌ర్వాత కొత్త చేరిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. ఇలా చేయ‌డం ద్వారా చేరిక‌ల విష‌యంలో  త‌న‌ను దోషిగా చూపుతున్న త‌న వ్య‌తిరేకుల‌కు చెక్ పెట్టిన‌ట్లు అవుతంద‌న్న‌ది కెప్టెన్ ఆలోచ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అయిన‌దానికి, కానిదానికి త‌న‌ను కార‌ణంగా చూపుతున్న కొంద‌రికి స్ట్రాంగ్ కౌంట‌ర్  ఇవ్వ‌డంతో పాటు...క్యాడ‌ర్‌కు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌చ్చ‌న్న‌ది ఉత్త‌మ్ ఆలోచ‌న అటా...

congress high command

ఇక హైక‌మాండ్ ఇప్ప‌డికే దిశా నిర్దేశానికి అనుగుణంగా...ముఖ్య నేత‌ల‌కు పార్టీ ప‌ని విభ‌జ‌న‌ను చేశారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్. రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాకు తోడుగా బోసు రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీమ్ అహ్మద్  ఏఐసీసీ కార్య‌ద‌ర్శుల‌కు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అప్ప‌గించారు ఉత్త‌మ్. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, మెదక్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలు ...ఆ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు కేటాయించగా. మరో కార్యదర్శి సలీమ్ అహ్మద్ కు మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలను అప్ప‌గించారు. ఇక  మూడో కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ కు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలు...వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల  భాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.వీరు ఆ నియోజకవర్గాల్లో అశావహుల పనితీరు, పార్టీకి చేసే సేవలు,ఆ నాయకుడికి ప్రజల్లో ఉండే ఆదరణ, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలతో పాటు...వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు కావ‌ల‌సిన అంశాల‌ను సేక‌రించి...ఎప్ప‌డిక‌ప్పుడు పార్టీ పెద్ద‌ల‌కు ఇస్తారు.

congress logo

మొత్తానికి ముంద‌స్తు ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తున్నాయ‌న్నవార్త‌ల నేప‌ధ్యంలో తెలంగాణ‌లో పార్టీని ప‌రుగ‌లు పెట్టించ‌డ‌మే ల‌క్ష్యంగా ఉత్త‌మ్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యుల‌కు ప‌నివిభజ‌న చేయ‌డం ద్వారా కింద స్థాయి వ‌ర‌కు క్యాడ‌ర్‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌చ్చ‌న్న ప్లాన్ ఒక‌టైతే...మ‌రోవైపు నేత‌ల మ‌ధ్య ఉన్న కీచులాట‌ల‌కు బ్రేకులు వేయడం ద్వారా అంతా ఒక్క‌టిగానే ఉన్నార‌న్న‌సందేశం ఇటు గ‌ల్లీ టూ ఢిల్లీ వ‌ర‌కూ పంపించ వ‌చ్చ‌న్న‌ది కెప్టెన్ స్కెచ్‌. ఇలా ద్విముఖ ఫ్యూహంతో ముందుకెలుతున్నారు పీసీసీ ఛీప్ ఉత్త‌మ్.

uttam kumar reddy

tags: uttam dwimuka vyuham,uttam 2019,uttam kumar reddy rebels,trs,kcr,congress rebels,kuntiya, telangana congress,uttam kumar reddy,uttam kumar reddy wife,uttam kumar reddy son,uttam kumar reddy songs,uttam kumar reddy bus yatra,uttam kumar reddy photos,uttam kumar reddy age,uttam kumar reddy speech,uttam kumar reddy mp3 songs,uttam kumar reddy wife photos uttam kumar reddy family,uttam kumar reddy audio songs,uttam kumar reddy anumula,uttam kumar reddy address,uttam kumar reddy affidavit,uttam kumar reddy assets,uttam kumar reddy air force,uttam kumar reddy army,uttam kumar reddy minister address,uttam kumar reddy house address,uttam kumar reddy biography,uttam kumar reddy biodata,uttam kumar reddy birthday,uttam kumar reddy brothers,uttam kumar reddy business,uttam kumar reddy beard,uttam kumar reddy congress,uttam kumar reddy childrens,uttam kumar reddy congress party,,uttam kumar reddy constituency,uttam kumar reddy contact number,uttam kumar reddy caste,uttam kumar reddy contact detail

Related Post