బీసీలకు న్యాయం జరిగేది ఒక్క కాంగ్రెస్ లోనే

news02 July 3, 2018, 8:09 p.m. political

Utham Kumar Reddy on BC welfare schemes

Hyderabad: దేశంలో సామాజిక న్యాయం అనే అజెండ్ ప్రధానంగా కాంగ్రెస్లోనే ఉందని, బీసీ లకు కాంగ్రెస్ పార్టీ లోనే రాజకీయంగా న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఓబీసీ విభాగం చర్మన్ సాహులు అన్నారు.మంగళవారం నాడు గాంధీభవన్లో చైర్మన్ చిత్తరాంజన్ దాస్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ ఓబీసీ విభాగం కార్యవర్గ సమావేశంలో వారు ప్రసంగించారు. 

Utham Kumar reddy

సాహూ మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ లోనే గుర్తింపు, న్యాయం జరుగుతుందని అన్నారు. 2019 లో రాహుల్ గాంధీ ని ప్రదానిగా చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓబీసీ లకు మంచి గుర్తింపు ఉందని పార్టీ కి అండగా నిలబడి పదవుల కోసం పోరాడాలని అన్నారు. 

Utham kumar Reddy BC meeting

కాంగ్రెస్ప్రభుత్వం తెచ్చేందుకు ఓబీసీలు కలిసి కట్టుగా పోరాడాలని అన్నారు. బీసీ లకు సంపూర్ణ న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం ఎజెండాగా ఉన్న కాంగ్రెసుకు అండగా ఉండాలని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంత రావ్, పొన్నాల లక్ష్మయ్య, మండలి సభ్యులు ఆకుల లలిత, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ లతో పాటు బీసీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు..

tags: Social justice, utham Kumar Reddy, Telangana BC welfare, BC censes in Telangana, BC sub castes in Telangana, BC cast reservations, tpcc BC comity, utham Kumar Reddy on BC reservations, BC welfare schemes, Telangana government welfare sechems.

Related Post