అసెంబ్లీలో నిమ్మకాయ కలకలం

news02 July 20, 2019, 4:34 p.m. political

Karnataka assembly

 

నిమ్మ‌కాయ‌లు, ప‌సుపు, కుంకుమ‌.. ఇవ‌న్ని మ‌న‌కు ఏ అమ్మావారిలో గుడిలోనో క‌నిస్తుంటాయి. అక్క‌డ వాటిని క‌ళ్ల‌కు అద్దుకోని.. త‌మ కోర్కెల‌ను మ‌న‌సులో అనుకోవ‌డం స‌హ‌జం. అదే నిమ్మ‌కాయ‌లు,కుంకుమ‌, ప‌సుపు గుడికాకుండా.. మ‌రెదైన చోట క‌నిపిస్తే .. వామ్మో అంటూ ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం స‌హ‌జం. అయితే మూఢ‌న‌మ్మ‌కాల‌పై న‌మ్మ‌ని వారైతే.. లైట్ తీసుకుంటారు.. అదే న‌మ్మేవాళ్లైతే.. ఎవ‌రైనా చేత‌బ‌డి చేశారేమో అని వారు వ‌ణిక పోతుంటారు. ఇప్ప‌డు ఇలా నిమ్మ‌కాయ క‌ర్నాట‌క అసెంబ్లీలో క‌ల‌క‌లం రేపింది. హాట్ డిస్క‌ష‌న్ తో.. సెగ‌లు క‌క్కుతున్న అసెంబ్లీలో నిమ్మ‌కాయను ప‌ట్టుకోవ‌డంతో ఏకంగా సీఎం కుమార‌స్వామి నోట చేత‌బ‌డి మాట‌ను ప‌లికించింది.

కుమార‌స్వామి ప్ర‌భుత్వంపై విశ్వాస ప‌రిక్ష పై చ‌ర్చ‌.దేశ‌వ్యాప్తంగా.. క‌ర్నాట‌క‌లో ఏం జ‌రుగుతందన్న‌ అస‌క్తి. గంట గంట‌కు పోలిటిక‌ల్ ట‌ర్నింగ్ తో .. హాట్ హాట్ చ‌ర్చ సాగుతున్న వేల‌.. సీఎం కుమార స్వామి..సోద‌రుడు మంత్రి రెవ‌ణ్ణ చేతిలో నిమ్మ‌కాయ ప‌ట్టుకుని కుర్చున్నారు. అందులో తెల్ల చొక్క‌, పంచె.. అది కాళ్ల‌కు చెప్పులు లేకుండా.. ఉండ‌టంతో.. ఆంధోళ‌న ప‌డ్డ కొంద‌రు బీజేపి ఎమ్మెల్యేలు రెవ‌ణ్ణ‌ను టార్గెట్ చేశారు. నిమ్మకాయలు, చేతబడులు ప్రభుత్వాన్ని కుమార స్వామి స‌ర్కార్ ను రక్షించలేవు అంటు విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Revanna in Karnataka assembly

మా సోద‌రుడు నిమ్మకాయలు చేత్తో ప‌ట్టుకుంటే త‌ప్పేంటీ..? హిందు విశ్వాసాల గురించి గొప్ప‌గా చెప్పే మీరే.. అదే విశ్వాసాల‌ను ఆచ‌రించే వారిపై విమ‌ర్శ‌లు చేస్తారా..? అంటు బిజేపీ పై నిప్పులు చెరిగారు కుమార స్వామి. రేవ‌ణ్ణ‌ ఎప్పుడూ నిమ్మకాయను చేత్తో పట్టుకుంటారు. గుడికి వెళ్తారు. అయితే ఆయనేదో చేతబడి చేస్తున్నారన్నట్లుగా మీరు విమర్శిస్తున్నారు. నిజంగా చేత‌బ‌డి ప్రభుత్వాన్ని రక్షించగలదా..? అని కుమారస్వామి ప్రశ్నించారు. మొత్తానికి బ‌ల‌నిరూప‌ణపై చ‌ర్చ సెగ‌లు గ‌క్క‌తున్న వేల‌... ఒక్క‌సారిగా చేత‌బ‌డి అంశం చ‌ర్చ‌కు రావ‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజంగా క‌ర్నాట‌క లీడ‌ర్స్ ఇంత సెంటిమెంట్ ఫూల్సా అంటు ఇదంతా చూస్తున్న‌వారు అనుకున్నారు.

tags: Karnataka assembly, Telangana assembly, Karnataka assembly floor test, minister revanna, Karnataka cm, yeddurappa, cm kcr, Telangana assembly, bhanamathi story, Karnataka assembly meeting.

Related Post