నాకా చాలా బాదేస్తోంది

news03 March 20, 2019, 3:08 p.m. political

sunitha

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై మీడియాలో వస్తున్న కధనాలు, రాజకీయ నేతలు మాట్లాడుతున్న మాటలు తనను మనోవేధనకు గురిచేస్తున్నాయని ఆయన కూతురు డాక్టర్ సునీత అన్నారు. ఈ కేసులో సిట్‌ దర్యాప్తుపై ప్రభావం పడేలా మిడీయా అనేక కథనాలు ప్రసారం చేస్తోందని, వెంటనే దీన్ని ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య జరిగినప్పటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూసి కలత చెందానని చెప్పారు. తన తండ్రి హత్యకు సంబందించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని సునీత కోరారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టమని చెప్పిన ఆమె.. ఆయనకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబమని తెలిపారు. పులివెందులలోని ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టమని..  అందుకే చాలా కాలంగా నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారని చెప్పింది. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని అంటుంటాటమని చెప్పిన సునీత.. ఈ విషయంలో కూడా ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించింది. సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోందన్న ఆమె... సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండని విజ్ఞప్తి చేశారు. జగన్‌ సీఎం కావాలని మా నాన్న బాగా కష్ట పడ్డారని సునీత చెప్పారు.

tags: sunitha, dr sunitha, ys viveka daughter sunitha, sunitha about ys viveka murder, ys viveka daughter about his murder, ys viveka murder case

Related Post