ప్రభుత్వం.. ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైంది

news02 May 18, 2019, 1:13 p.m. political

Tpcc chief uthamkumar Reddy met Election commission

 

 

ఎన్నికలకు.. ఫలితాలకు మధ్య 40 రోజుల గ్యాప్ పెడితే.. అది ప్రలోభాలకు దోహద పడుతుందని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్ కు, ఫలితాలను మధ్య చాలా రోజుల గ్యాప్ ఉందని.. ఇకపైనైనా ఇలా చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ ల ఎంపిక విషయంలో విపక్ష పార్టీల నేతలు ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లో చైర్మన్ ల ఎంపిక జరిగేలా చూడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని విపక్ష పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. బ్లాక్ మనీ, పోలీసులను ఉపయోగించి ఇతర పార్టీల నాయకులను అప్రజాస్వామిక పద్దతిలో టీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మే 27 న కౌంటింగ్ చేసి 3 రోజుల్లో చైర్మన్ ల ఎంపిక చేసి జులై 5 తరువాత ఛార్జ్ తీసుకోవచ్చని ఆయన ఈసీకి తెలిపారు. 

Uthamkumar Reddy met Election commission

తెలంగాణలోప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరినట్లు ఉత్తమ్ చెప్పారు. ఎక్కువ గ్యాప్ ఇస్తే ఎంపిటిసి, జెడ్పిటిసిలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చట్టాల పట్ల కేసీఆర్ కు గౌరవం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఛైర్మన్ ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూసే భాద్యత ఎన్నికల సంఘంపైనే ఉందని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలి ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

tags: Utham Kumar reddy, Pcc chief, Telangana Congress president, Rahul Gandhi, Rahul Gandhi direction, Sonia Gandhi, revantth reddy, Lok Sabha elections, Telangana loksabha constencies, Telangana election results, cm kcr, Rahul Gandhi contact numbers , Rahul Gandhi address, aicc president, Gandhi statue, TS Cong leaders protest, election commission, Telangana election, telangana assembly.

Related Post