నర్సాపూర్ మీటింగ్ సాక్షిగా మాట్లాడు కోని కేసీఆర్ .. హరీష్ రావు

news02 April 3, 2019, 10:53 p.m. political

Crashes between cm kcr and Harish rao

 

 

 మెదక్ : హరీష్ రావు కు సీఎం కేసీఆర్ కు కొన్ని రోజులుగా మాటలు లేవు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ వార్తలకు నర్సాపూర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభ సాక్షిగా మిగిలింది. సభ వేదికపై సీఎం కేసీఆర్ 40 నిమిషాలు ఉన్నా హరీష్ రావు, ఆయన కల్వలేదు.

మెదక్ జిల్లా నర్సాపూర్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య దూరం కనిపించింది. సీఎం కేసీఆర్ సభ స్థలానికి వచ్చింది మొదలు.. కేసీఆర్ సభా వేదిక దిగిపోయేవరకు ఇద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. సీఎం కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభంలో పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు తప్ప మరో పేరు తీసుకోలేదు. మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులకు నమస్కారం అని పరోక్షంగా అందరినీ ప్రస్తావించారు. ఇతర సమావేశాల్లో స్టేజీ మీద ఉన్న ప్రతిఒక్కరిని దాదాపుగా పేరుపేరునా సీఎం కేసీఆర్ చదవడం కనిపించేది.5 సీఎం కేసీఆర్ తన ప్రసంగం మధ్యలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్లను మాత్రమే ప్రస్తావించారు. ఐతే.. పార్టీకి, జిల్లాకు సంబంధించిన కీలక నాయకుడు హరీష్ రావు పేరును కేసీఆర్ ఎత్తలేదు. ఈ సభకు జనం బాగా తరలి వచ్చారు. హరీష్ రావు బాధ్యత వహిస్తున్న మెదక్ లో భారీ మెజార్టీ ఇచ్చేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల లప్పటీనుంచి కేసీఆర్ కు.. హరీష్ రావు కు మధ్య సఖ్యత లేదు.. ఇద్దరి మధ్య మాటలు లేవు.

ప్రసంగంముగిసిన తర్వాత వేదికపై ఉన్న నాయకులను పలకరిస్తూ సీఎం వెళ్లారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ఇతర నాయకులను సీఎం పిలిచి మాట్లాడారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు చివర్లో ఎదురుపడినప్పటికీ పలకరింపులు లేవు. కేసీఆర్ కంటే ముందే హరీష్ రావు స్టేజీ దిగిపోవడం కనిపించింది.

tags: Harish Rao, Ktr, kcr family, kaleswaram project, Telangana irrigation projects, kcr son, cm kcr cell nber, cm, na kcr Telangana, pragathibavan, Telangana assembly, Telangana budnarsapyr t, cm kcr,TelnganMLAs , Telangana CMO

Related Post