కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై గెజిట్ విడుదల

news02 March 14, 2018, 12:17 p.m. political

అసెంబ్లీలో మండలి చైర్మన్ పై దాడి చేశారని.. సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ రెడ్డిల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.  దీనికి సంబంధించి తెలంగాణ శాసనసభ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇద్దరి శాసన సభ సభ్యత్వాల రద్దు దృష్ట్యా రెండు స్ధానాలు ఖాళీ అయినట్లు తెలంగాణ అసెంబ్లీ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫ్యాక్స్ ద్వారా సమాచారం పంపింది.

ఈనెల 13నుంచి రెండు స్ధానాలు ఖాళీ అయినట్లు తెలంగాణ అసెంబ్లీ గెజిట్ పేర్కొంది.

Related Post