పార్టీ మారేందుకు సిద్ధమైన డి.శ్రీనివాస్

news02 May 14, 2018, 9:51 p.m. political

Mp d.srinivas leaving trs

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వలేదని.. తనకు చెప్పకుండా తన శిష్యురాలు ఆకుల లలిత కు అదే ఎమ్మెల్సీ సీటు ఇచ్చి కాంగ్రెస్ హైకమాండ్ అవమానించిందని 2015లో టిఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజ్యసభ సీటు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంపీ పదవిలో కొనసాగుతున్నారు.

Mo ds insult in trs plenary

ఆదివారం నిజామాబాద్ లో కార్యకర్తలతో డీఎస్ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. తనకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై అసంతృప్తితో ఉన్న డీఎస్ పార్టీ మారే అంశంపై చర్చించినట్లు సమాచారం. టిఆర్ఎస్ లో తనను అవమానించారని డీఎస్ కార్యకర్తలతో ప్రస్తావించినట్లు సమాచారం. తన వెంట వచ్చినవారికి ఎవరికి పదవులు దక్కకుండా ఎంపీ కవిత అడ్డుకుంటున్నారని డి.శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ కమిటీలతో పాటు, నామినేటెడ్ పోస్టులు చివరికి రైతు సమన్వయ సమితుల్లో కూడా తన అనుచరులకు అవకాశం ఇవ్వకపోవటంపై డీఎస్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మారటమే మంచిదనే అభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది.

D.srinivas met cm kcr

రాజ్యసభసభ్యుడుపదవికిడీఎస్రాజీనామా..!

హైకమాండ్ తో టచ్ లో ఉన్న డీఎస్ జూన్ మొదటి వారంలో కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలనే యోచనలో డీఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ నుంచి తన కుమారుడు సంజయ్ కు టికెట్ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ నేత ఆజాద్ తో డీఎస్ మాంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరారు. తను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.

tags: Mp d.srinivas, ds , cm kcr, congress, soniya gandhi, rahul gandhi, utham kumar reddy, mp kavitha, nijamabad, sanjay.

Related Post