కొత్త ఒరవడికి తెరలేపిన V6 న్యూస్

news02 May 29, 2019, 2:40 p.m. political

V6 news Given One month salary Bonus to Employees

 

హైదరాబాద్

: మీడియా లో V6 ఎప్పుడు సంచలనమే. అది వార్తల పరంగా కావొచ్చు.. దాంట్లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం గురించి కావొచ్చు. ఇప్పుడు అలాంటి సంచలనానికి తెరలేపింది వి6. ప్రస్తుతం తెలుగు మీడియా లో కొన్ని న్యూస్ ఛానళ్లలో నే జీతాలు పెంచుతారు. కొన్ని ఛానళ్లలో అయితే అసలు జర్నలిస్టులు జీతాలు టైమ్ కు వస్తే చాలు.. అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి మీడియా విపత్కర పరిణామాలు ఎదుర్కుంటున్న సమయంలో ఏ ఛానల్ చేయని సాహసం చేసింది V6. 

అంతర్గత కుమ్ములాటలతో పెద్ద పెద్ద మీడియా సంస్థలే కుప్పకూలుతున్న ఈ రోజుల్లో V6 NEWS మరోసారి తన నిబద్ధతను నిరూపించుకుంది. పెద్ద పెద్ద సంస్థలే వాటాల అమ్మకాలు, కొనుగోళ్లలో సతమతం అవుతుంటే.. తెలుగు మీడియా లో ఇలాంటి ఛానల్ కూడా వుంది అని V6 నిరూపించింది. ఒక నెల బేసిక్ జీతాన్ని ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ యాజమాన్యం. 

ప్రతి ఏడాదిజీతాలు పెంచి వారికి భరోసా ఇచ్చే v 6.. ఇప్పుడు బోనస్ ప్రకటించింది. T న్యూస్ లాంటి అధికారిక ఛానల్ కూడా ఉద్యోగుల కోసం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. మీడియా లో జీతాలు ఇవ్వటమే ఎక్కువ అనే టైమ్ లో తమ ఛైర్మన్ వివేక్, సీఈఓ రవి అంకం బోనస్ ప్రకటించి మీడియా లో చర్చకు తెరలేపారు.

V6 news CEO Ankam Ravi

తెలంగాణ ఉద్యమం టైమ్ లో ఈ రంగంలోకి అడుగుపెట్టిన V6 .. తెలంగాణ ప్రజల వాణీ ని వినిపించి.. ప్రత్యేక ప్రజంటేషన్ తో టాప్ ఛానళ్ల సరసన నిలిచింది. తెలంగాణ ప్రజలు తమ సొంత ఛానల్ అనుకునే విధంగా.. జనాల్లోకి చొచ్చుకెళ్ళింది. V6 చైర్మన్ వివేక్ వెంకట స్వామి ఏ పార్టీలో ఉన్నా.. ఛానల్ ను న్యూట్రల్ స్టాండ్ గా నడపటం లో V6 సీఈఓ అంకం రవి కృషి చెప్పుకోదగ్గది. దాంతో వివేక్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోయినా ఛానల్ ప్రోగ్రామింగ్ లో ఎక్కడా మార్పు కనపడలేదు. వివేక్ పార్టీ మార్పులతో సంబంధం లేకుండా ఛానల్ ను సీఈఓ అంకం రవి నడిపిస్తున్నారు కాబట్టి.. వివేక్ కు టీఆర్ఎస్ కు టిక్కెట్ ఇవ్వకపోయినా ఛానల్ ఎక్కడా ఢీలా పడలేదు. అప్పుడు ఇప్పుడు V6 తెలంగాణ లో నంబర్ 1 గా నిలబడేందుకు సీఈఓ అంకం రవి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే కారణం.

V 6 న్యూస్ ఆధ్వర్యంలో వచ్చిన వెలుగు పత్రిక కూడా విజయవంతం కావటంతో ఉద్యోగులకు ఒకనెల బోనస్ ను ప్రకటించింది యాజమాన్యం. యాజమాన్యం ను ఒప్పించటం లో సీఈఓ అంకం రవి చొరవ తీసుకోవటంతో మీడియా లో కొత్త అధ్యాయానికి V 6 తెరలేపింది. 2018 _2019 వార్షిక సంవత్సరం లో వచ్చిన లాభాలను ఉద్యోగులకు పంచారు. నిజానికి లాభాలు పంచకున్న ఎవరు అడగరు. కానీ ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు సీఈఓ అంకం రవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తనికి మిగతా మీడియా కూడా V 6 దారిలో నడిస్తే జర్నలిస్ట్ మిత్రులకు మంచి జరగటం తో పాటు .. కొత్త సంప్రదాయానికి తెరలేసి తెలుగు మీడియా పై కనీసం గౌరవం అయినా దక్కుతుందని చర్చ జరుగుతోంది.

tags: V6 news, MP Vivek , kaka, G.venkatswamy, ceo Ankam Ravi, Sangappa, Kaka family, G. Vivek, peddapalli MP, Vishaka industries, Visaka Md Vivek.

Related Post