గాంధీభవన్ రెండో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ దీక్ష

news02 March 14, 2018, 11:47 a.m. political

అసెంబ్లీలో తమ సభ్యుల్ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది.  ఈరోజు దీక్షలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్వామి గౌడ్ కు ఎక్కడ?..ఎలా?.. గాయమైందో అసెంబ్లీ వీడియో ఫుటేజ్ ను బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు దీక్షలో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్న కాంగ్రెస్ నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అరెస్టులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తెలుపుతున్న కాంగ్రెస్ నేతల్ని సైతం పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post