అమ‌ర జ‌వాన్ ను అవ‌మానించిన మోడి స‌ర్కార్

news02 March 3, 2019, 10:46 p.m. political

PM Modi insult Kashmir mytries

కాశ్మీర్ ఉగ్ర‌దాడిలో అమ‌ర‌వీరునికి ..మోడి ప్ర‌భుత్వం అవ‌మానించింది. శ‌త్రువుల చేతిలో దేశం కోసం ప్రాణాలొదిలిన‌.. ఆ వీరుడికి క‌నీసం శ్ర‌ద్దాంజ‌లి కూడా ఘ‌టించ‌కుండా.. అవమానించింది మోడీ స‌ర్కార్. అదేంటీ.. అమ‌ర‌వీరుల గురించి..వారి గొప్ప‌త‌నాల గురించి.. మాట్లాడుతూ..ఓట్ల రాజ‌కీయం చేసుకుంటున్న‌మోడీ.. ఆ అవ‌కాశాన్ని ఎలా వ‌దుల‌కున్నార‌బ్బా అనేక‌దా మీ అనుమానం.. అవును. కావాలనే చేశారో.. లేక ఎందుకులే..అని లైట్ తీసుకున్నారో ఏమో కాని.. జమ్ము కాశ్మీర్ , హంద్వారాలో శుక్రవారం (3 వ‌తేది) ఉగ్ర‌వాదుల దాడిలో అమ‌రుడైనా.. సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్ట‌ర్ పింటూ కుమార్ సింగ్ కు క‌నీసం క‌డ‌సారి అంజ‌లి కూడా ఘ‌టించ కుండా అవ‌మానించ‌డంతో.. ఇప్పుడు మోడి అండ్ టీమ్ పై దేశవ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెళ్ళువెత్తుతున్నాయి. 

PM Modi insult Kashmir mytries

భ‌ధ్రతాధ‌ళాల‌కు ఉగ్రవాదుల మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అమ‌రుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్ట‌ర్ పింటూ కుమార్ సింగ్ మృత‌దేహం ఆదివారం ఉద‌యం పాట్నాలోని జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది.. పింటూ సింగ్ మృత‌దేహాన్ని తీసుకునేందుకు ఆయ‌న కుటుఏంబ స‌భ్యులు త‌ప్పా.. ఏ ఒక్క మంత్రి రాలేదు. ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష‌మైన రాష్ట్ర సిఎం కాని, మంత్రులు కాని రాలేదు. పోని రాష్ట్రంలో అందుబాటులో లేర‌న్న‌ట్లు కూడా లేదు. శ‌నివారం నుండే.. ఓ అర‌డ‌జ‌న్ మంది కేంద్ర‌మంత్రులు పాట్నాలోనే ఉన్నారు. ఆదివారం మోడి ఎన్నిక‌ల ప్ర‌చార‌ ర్యాలి ఉండ‌టంతో.. వారంత పాట్నాలో ఉండి కూడా..ఏ ఓక్క కేంద్ర మంత్రి ఏయిర్ పోర్ట్ కు రాలేదు. అదే మోడి కి స్వాగతం ప‌లికేందుకు మాత్రం కేంద్ర మంత్రులు క్యూ క‌ట్ట‌డంపై .. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మోడి నిత్యం దేశ‌భ‌క్తి గురించి చెబుతుంటారు.. ఇదేనా ఆయ‌న అమ‌రుల‌కు ఇచ్చిన గౌర‌వం అంటు మండిప‌డుతున్నారు. అమ‌ర‌ జ‌వాన్ క‌న్నా.. మోడికి ఎన్నిక‌ల ప్ర‌చారమే ముఖ్య‌మా అంటు.. పింటూ కుమార్ మామ సంజ‌య్ సింగ్ మండిప‌డ్డారు. అయితే జ‌వాన్ కు నివాళులులు అర్పించిన వారిలో .. బిహార్ పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ ఎంపీ చౌద‌రి మ‌హ‌బూబ్ అలీ ఖైస‌ర్, సీఆర్పీఎఫ్ అధికారులు మాత్ర‌మే ఉన్నారు.

tags: PM Modi, Kashmir mytries families, pulvama issue, abhinandan family, abhinandan cast, abhinandan chaild hood, jaishe ahamd, ugravadam, Pakistan , Modi, Narendra Modi.

Related Post