ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

news02 April 23, 2019, 11:08 a.m. political

Ap Election

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడందరి దృష్టి ఏపీ ఫలితాలపైనే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నిక ముగిసిన తర్వాత మరింత టెన్షన్ పెడుతోంది. గతంలో ఎప్పుడూ కూడా పోలింగ్ రోజుకు.. రిజల్ట్ డేకు మధ్య ఇంత గ్యాప్ రాలేదు. 2004లో కూడా 20 రోజులు గ్యాప్ వచ్చింది కానీ.. ఇప్పుడు ఏకంగా 43 రోజుల తర్వాత పలితాలు వస్తున్నాయి. పార్టీల్లో నరాలు తెగే ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఎవరికి వారు విజయంపై ధీమాగానే కనిపిస్తున్నారు కానీ.. లోలోన ఆందోళన వెంటాడుతోంది. ఏప్రిల్ 11 వరకు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నానా పాట్లు పడ్డారు అధినాయకులు.. ఆ తర్వాత నుంచి ప్రజలు ఎవరికి ఓటేశారోనన్న టెన్షన్ పడుతున్నారు. ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన సహజశైలిలో సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సరళి.. అభ్యర్ధుల నివేదికలు, సొంత నివేదికలతో ఎప్పుటికప్పుడు అభ్యర్ధులతో చర్చిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం సందర్భంగా చాలామంది నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

Ap Election

అటు వైసీపీ కూడా విజయంపై ధీమాగా ఉంది. అంతర్గతసమావేశాల్లో 130 సీట్లు వస్తాయంటూ చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతారంటూ చెప్పి మరీ కేడర్ లో ఉత్సాహం నింపారు. YCP కూడా అధికారంపై ధీమాగా ఉన్నా.. జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ తొలగలేదు. ప్రజాతీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల సరళిపై అంతర్గతంగా సమావేశమయ్యాయి. తమకు వచ్చే సీట్లు.. ఓట్లపై అంచనాలేస్తున్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని అంటున్నారు. అటు జరిగిన నష్టంపై కమలనాథులు అంచనాల్లో నిమగ్నమయ్యారు.

Ap Election

ఎన్నికల జరిగిన తర్వాత ఫలితాలకు 43 రోజుల సమయం ఉండడంతో ప్రతిరోజూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరికి వారు సర్వేలంటూ అవి తమకే అనుకూలమంటూ చెప్పుకుంటున్నారు. జనాల్లోకి పంపుతున్నారు. దీంతో టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇంకా 30 రోజుల పాటు ఈ నరాల తెగే ఉత్కంఠ తప్పదు. దీనికి తోడు ఈవీఎంల తరలింపు… విమర్శలు, వివాదాలు, ఈసీలకు ఫిర్యాదుల వంటి అంశాలతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఎన్నికల ముందు కంటే.. తర్వాత కూడా రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏపీలో సరికొత్త రాజకీయం కనపడుతోంది. మరి మే 23 రోజు ఏం జరుగుతుంది. పరిస్థితులు మరెలా ఉంటాయో చూడాలి

Ap Election

tags: ANDRAPRADESH ELECTION, CHANDRABABU,YS JAGAN MOHAN REDDY, PAWAN KALYAN,TDP,YSRCP, JANASENA,BJP, CONGRESS, ELECTION CAMPAIGN, ELECTION COMMISSION,TRS,TPCC,KCR,UTTAM KUMAR REDDY, REVANTH REDDY

Related Post