మోడీ ది ..అంతా గాజుల సప్పుడే ..

news02 May 11, 2019, 10:43 p.m. political

modi_and_siddu, navjyoth singh siddu,

ఇండోర్ ; మాటల మాంత్రికుడు , కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ..  ప్రధాని నరేంద్ర మోడీ పై పంచ్ లు విసిరారు. మోడీ పనితీరును ..పని తక్కువ.....మాటలెక్కువగా మాట్లాడే కొత్త పెళ్లికూతురుతో పోల్చారు. తక్కువ రోటీలు తయారు చేస్తూ...గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివారు మోడీజీ అని సిద్దూ సెటైర్ విసిరారు. రోటీలు చేస్తూ గాజులతో శబ్దం చేయడం చూసి .. అత్తారింట్లో,, ఇరుగుపొరుగు వారు  అందరు పెళ్లికూతురు బాగా పనిచేస్తోందని అనుకుంటారట .. తీరా రోటీల లెక్కచూస్తే..అసలు విషయం అర్థమైందట .. సరిగ్గా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా ఇదే జరిగుతుందని..లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌ లో పర్యటించిన సిద్దూ .. మోడీని ఏకిపారేశారు. 'ఇండియా డివైడర్ ఇన్ చీఫ్' హెడ్ లైన్ తో టైమ్ మ్యాగజైన్‌ కవర్ పేజీ ఆర్టికల్‌ ను ప్రస్తావించిన సిద్దూ .. మోడీ డివైడర్ ఇన్ చీఫ్ తోపాటు , అబద్ధాలాడటంలో కూడా చీఫ్ అని అన్నారు . అంతేకాదు నరేంద్ర మోడీ అంబానీ, అదానీల "బిజినెస్ మేనేజర్" అని సిద్ధూ విమర్శలు గుప్పించారు. బీజేపీని, ఆ పార్టీ నేతలను బ్రిటిషర్లతో సిద్ధూ పోలుస్తూ, ఈ దేశం నుంచి వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మౌలానా అజాద్. మహాత్మగాంధీల పార్టీ కాంగ్రెస్ అని, బ్రిటీష్ రూల్ నుంచి భారత్ కు స్వాత్రంత్యం కోసం కాంగ్రెస్ పోరాడిందని సిద్దూ తెలిపారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ, హామీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలపై,నల్లధనం వెనక్కి తీసుకురావడంపై.. మోడీ ఓపెన్ డిబేట్ కు రావాలని ., డిబేట్ లో తాను కానీ ఓడిపోతే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్దూ సవాల్ విసిరారు.దేశంలోని ప్రతి ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్దమైన వ్యవస్థలను మోడీ నాశనం చేశారని మండిపడ్డారు సిద్దూ.

tags: navjyoth singh siddu, bride, pm modi, election campaine , indore, mp, siddu setairs, siddu fire, pride grume

Related Post