ఐదు రాష్ట్రాల్లోను విజయం సాధించనున్న కాంగ్రెస్..

news02 Nov. 7, 2018, 3:07 p.m. political

congress

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా బీజేపీకి, మోదీకి ఎదురు గాలీ వీస్తోంది. అది కర్ణాటక నుంచే మొదలైంది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. కర్నాటకలోని బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ శనివారం ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జయభేరీ మోగించారు. రామనగర నియోజకవర్గం నుంచి సమీప బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. 

congress

ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలిచారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీ పార్టీనే గెలుస్తూ వస్తోంది. మరోవైపు గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం బళ్లారి. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో గెలుపొందారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపాలవ్వగా.. కాంగ్రెస్ గెలుపొందింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత పోటీ చేశారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. ఉగ్రప్పకు జేడీఎస్‌ పార్టీ మద్దతివ్వడంతో 2లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక మాండ్య లోక్ సభ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించగా...  జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతివ్వడంతో సునాయాసంగా గెలిచారు. 

congress

మరోవైపు జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలోను కాంగ్రెస్‌ పార్టీ విజయ డంకా మోగించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధరామయ్య కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక కర్ణాటక ప్రజల అభిప్రాయం దేశవ్యాప్తంగా ప్రతిబించనుందని వేరే చెప్పక్కర్వేదు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుల చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి గెలుపు తరహాలోనే.. తెలంగాణలోను ప్రజా కూటమి విజయం సాధిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచి.. రాహూల్ గాంధీ ని ప్రధానిగా చూడాలన్న ప్రజల కోరిక నెరవేరబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

 

tags: congress, congress win, congress win in congress, congress win in karnataka by poll, congress jds win in karnataka

Related Post