ఎమ్మేల్యేల కోటాలో కాంగ్రెస్ ద‌క్కేది ఒకే ఒక ఎమ్మేల్సీ

news02 Feb. 12, 2019, 9:57 p.m. political

Mlc seat full demand in congress

హైదరాబాద్ : ఒకే ఒక ప‌ద‌వి కోసం డ‌జన్ మంది లీడ‌ర్లు క్యూక‌ట్టారు. ఓడిపోయిన సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అన్న తేడా లేదు అంద‌రూ ఆ ఒక్క‌టే కావాలంటున్నారు. ఆ ప‌ద‌వి కోసం హైక‌మాండ్ వ‌ద్ద త‌మ ప్ర‌తిభ పాటావాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏంటా ప‌ద‌వి? ఈ స్టోరీ చూద్దాం.

ఎమ్మేల్యేల కోటాలో కాంగ్రెస్‌కు వ‌చ్చేది ఒకే ఒక్క ఎమ్మేల్సీ. దీనికి కోసం పార్టీలో 10మందికి పైగా పోటీప‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోరా ప‌రాజ‌యంతో పార్టీలో చాలా మంది సీనియ‌ర్లు ఇంట్లో సిట్టింగ్ వేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. జానారెడ్డి, మర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, ష‌బ్బీర్ అలీ, జీవ‌న్‌రెడ్డి, డి.కే అరుణ‌, గీతారెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, చిన్నారెడ్డి, నేరేళ్ళ శార‌ద‌, సునీత ల‌క్ష్మారెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌ లాంటి నేత‌లు ఇంటికి ప‌రిమితం కావ‌ల‌సి వచ్చింది. ఈనేప‌థ్యంలో ఎమ్మేల్సీ ఎన్నిక‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

Congress LLC list in assembly

ప్ర‌స్తుతం అసెంబ్లీ లో బ‌లాబ‌లాల ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీకి 19మంది ఎమ్మేల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మేల్సీ గెలువాలంటే 17మంది ఎమ్మేల్యేల బ‌లం కావాలి. సో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మేల్సీ ఖాయం. ఈ ఒక్క స్థానం కో్సం కాంగ్రెస్‌లో డ‌జ‌న్ మంది సీనియ‌ర్లు పోటీప‌డుతున్నారు. ఇక్క‌డ నోరు విప్ప‌కుండా పార్టీ హైక‌మాండ్ వ‌ద్ద ఎమ్మేల్సీ ఇవ్వాల‌ని ప్రెష‌ర్ బిల్డ‌ప్ చేస్తున్నారు. జానారెడ్డి , దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌, పొన్నాల‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌ర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ , గీతారెడ్డి పార్టీ హైక‌మాండ్ వ‌ద్ద ప‌లుకుబ‌డితో ఎమ్మేల్సీ కోసం పట్టుప‌డుతున్నారు. ఇక శ‌శిధ‌ర్‌రెడ్డి, నేరెళ్ళ శార‌ద‌లు అసెంబ్లీ టికెటు ఆశించారు. టికెట్ రాక‌పోయినా పార్టీ కోసం ప‌నిచేశారు. దీంతో త‌మ‌కు ఎమ్మేల్సీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

Telangana Congress leaders

మార్చినాటికి కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ష‌బ్బీర్ అలీ, పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డిల ప‌ద‌వీకాలం ముగిసిపోతోంది. ఆకుల ల‌లిత టిఆర్ ఎస్‌లో చేరింది. టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాముల్ నాయ‌క్‌, యాద‌వ‌రెడ్డిల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. కొండా ముర‌ళి రాజీనామా చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్సీ కోటాలో ఎన్నిక‌య్యే ఒకే ఒక్క‌డే కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహించ‌వ‌ల‌సి ఉంటుంది. అందుకే ప‌లువురు సీనియ‌ర్లు ఒకే ఒక ఎమ్మ‌ల్సీ కోసం ప‌ట్టుప‌డుతున్నారు. ష‌బ్బీర్ అలీ, పొన్నం ప్ర‌భాక‌ర్‌, జీవ‌న్‌రెడ్డిలు ఎమ్మేల్సీ బ‌రిలో ఉన్నా ష‌బ్బీర్ అలీ నిజామాబాద్ ఎం.పిగా, పొన్నం, జీవ‌న్‌రెడ్డి లలో ఎవ‌రో ఒక‌రిని క‌రీంన‌గ‌ర్ ఎం.పిగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. జీవ‌న్‌రెడ్డి వీల‌యితే ఎం.పిగా లేదా ప‌ట్ట‌భద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని కూడా భావిస్తున్నారు. 

Revantth reddy

ఒక్క ఎమ్మెల్సీ కోసం డ‌జ‌న్ మంది పోటీప‌డుతున్న క్ర‌మంలో హైక‌మాండ్ ఎవ‌రిని క‌రుణిస్తుందో చూడాలి. ఇదంతా ప‌క్క‌కు పెడితే ఎమ్మేల్యేల కోటా ఎన్నిక జ‌రిగే నాటికి అస‌లు కాంగ్రెస్ పార్టీలో క‌నీసం 17మంది ఎమ్మేల్యేలు మిగులుతారా? లేదా అనేది చూడాలి.

tags: Utham Kumar reddy, Pcc chief, Telangana Congress president, Rahul Gandhi, Rahul Gandhi direction, Sonia Gandhi, revantth reddy, Lok Sabha elections, Telangana loksabha constencies, Telangana election results, cm kcr, Rahul Gandhi contact numbers , Rahul Gandhi address, aicc president, revanth Reddy, congress loksabha candidates, Telangana no s, khamma mp, Hyderabad no.

Related Post