ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మొదలైన కలవరం

news02 June 11, 2019, 3:55 p.m. political

high court

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షంలో విలీనం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు  విచారించింది. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్, అసెంబ్లీ కార్యదర్శి సహా.. గతంలో టీఆర్ ఎస్ లో చేరినట్టు ప్రకటించిన 10మంది ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్ ఎస్ లో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపైనా హైకోర్టులో విచారణ జరిగింది. శాసనమండలి ఛైర్మన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేశారని షబ్బీర్‌ అలీ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. శాసన మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, ఎన్నికల సంఘంతో పాటు టీఆర్ ఎస్ లో విలీనమైన నలుగురు ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్‌, ఆకుల లలిత, ఎం.ఎస్‌ ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి లకు నోటీసులు జారీ చేసింది. 

congress

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క.. దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. సీఎల్పీని టీఆర్ ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేయాలని టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని పిటీషన్ లో పేర్కొన్నారు ఒకవేళ విలీనం చేయాలంటే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినా స్పందించలేదని ఉత్తమ్‌, భట్టి పిటిషన్‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల పిటీషన్ పై విచారించిన హైకోర్టు.. పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, డి.సుధీర్‌ రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌ రెడ్డి, హర్షవర్దన్‌ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, సురేందర్‌ లతో పాటు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నర్సింహులు చారి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

tags: high court, high court notice to speaker, high court notice to assembly speaker, high court notices to congress mlas, highcourt issued notices to defected MLAs, highcourt issued notices to defected congress MLAs

Related Post