రాహూల్ విమానంలో సాంకేతిక లోపం

news02 April 26, 2019, 6:29 p.m. political

rahu

ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీకి భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బీహార్ లోని పట్నాకు బయల్దేరారు. కొంత దూరం వెళ్లగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలోని సాంకేతిక సమస్యను అధికారులకు వివరించిన పైలట్లు.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దీంతో వెంటనే రాహూల్ ప్రయాణిస్తున్న విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రాహూల్ గాందీ ట్విటర్‌ లో పోస్ట్ చేశారు. రాహూల్ గాంధీ ప్రయాణించిన విమానంలో పైలట్లతో సహా మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్,  మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ గాంధఈ పాల్గొనాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఆయా సభలు ఆలస్యంగా ప్రారంభమవుతాయని, అసౌకర్యానికి క్షమించాలని రాహుల్‌ ట్విటర్‌ ద్వారా కోరారు. ఇక విమానంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తడంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి ఘటనే ఎదురైన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

tags: rahul rahul gandhi, rahul gandhi filght, technical problem in rahul flight, rahul gandhi escaped flight accident, rahul flight technical problem

Related Post