గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులెవరు మాకు ఓటు వేయలేదు

news02 April 7, 2019, 7:36 a.m. political

Ktr sensational comments on govt employees

ప్రభుత్వ ఉద్యోగుల పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఉద్యోగులు ఎవరూ ఓటు వేయలేదు హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల వేళ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగులపై తమ పార్టీ లైను తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అన్నారు. అందుకే  సీట్లు కోల్పోయామని అన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు తమ అభ్యర్థులు ఓడిపోయారు అని అన్నారు.

Ktr sensational comments on govt employees

ఇప్పటికేప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య దూరం పెరుగుతోంది. రెవెన్యూ శాఖలో రద్దు చేసి పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ కలుపుతారని రెవెన్యూ ఉద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రెవిన్యూ ఉద్యోగులపై కెసిఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెవెన్యూ , ఇరిగేషన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు టిఆర్ఎస్ కు ఓటు వేయలేదని కేసీఆర్ పలువురు నేతలతో సంభాషించినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలకు తోడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టు గా కనిపిస్తున్నాయి.

Ktr live shows

నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు సగానికి పైగా టిఆర్ఎస్ కు ఓటు వేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు తమకు ఓటు వేయలేదని కేటీఆర్ చెప్పడం ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడమేన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టిఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం మదన పడుతున్నారు. తమపై ఇలాంటి అభిప్రాయం ఉన్న టిఆర్ఎస్ నేతలకు తమ ఓటు అనవసరంగా వేశామన్న అభిప్రాయానికి కొంతమంది ఉద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు విలువ ఏంటో తెలుపుతామని మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ఇలాంటి వాఖ్యలు చేయటం అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది.

tags: TRS working president, Ktr, harish Rao, cm kcr family, TRS leaders, tsrtc, tmu aswaddama Reddy, Harish Rao resigned, cm kcr resign, Telangana govt employees, telangana secratariate, Telangana loksabha elections, TRS MP candidates.

Related Post