నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఏపీ ప్ర‌యోజ‌నాలు వివ‌రించ‌లేక‌పోయారు

news02 June 18, 2018, 12:12 p.m. political

roja fire on chandrababu

తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు మ‌రోసారి ఢిల్లీ వేదిక‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు. నీతి ఆయోగ్ మీటింగ్‌లో భూకంపం సృష్టిస్తాన‌ని చెప్పి...ఢిల్లీకి వెళ్లి తోక ముడవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.  అస‌లు చంద్ర‌బాబు నీతి ఆయోగ స‌మావేశంలో వ్య‌వ‌హ‌రించిన తీరే స‌రిగా లేద‌న్నారు. 

ycp roja

అలాగే కొంత‌మంది కావాల‌నే త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని రోజా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ‌దిలి జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు పుకార్లు సృష్టించి త‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. అస‌లు టీడీపీ నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు చేసిన మంచి ప‌నులు చెప్పుకోలేక‌నే ఇలాంటీ త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాదు టీడీపీ నేత‌లు 2019 ఎన్నిక‌ల‌పై స‌ర్వేలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. గెలిచే సీట్ల‌పై వారు చేస్తున్న కామెంట్స్ చూసి న‌వ్వోస్తుంద‌న్నారు. న‌గ‌రిలో వైసీపీ గెలుస్తుంది కానీ, రోజా మాత్రం ఓడిపోతుంద‌ని జోకులు వేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉందన్నారు. 

 

tags: ycp mla roja,heroien roja,heroine roja family photos,heroine roja caste,heroine roja biodata,heroine roja gurinchi,heroine roja biography,heroine roja accident,heroine roja family photo,heroine roja marriage photos,roja heroine family photos,heroine roja family, heroine roja children's,heroine roja date of birth,heroine roja daughter images,heroine roja dead,heroine roja died,heroine roja death,roja koottam heroine name,roja kootam heroine,roja koottam heroine,heroine roja latest news,heroine roja marriage,roja film heroine madhubala wiki,,caste of heroine roja,heroine roja wikipedia,heroine roja wedding photos,telugu heroine roja wikipedia

Related Post