మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బిజెపి చూస్తోంది

news02 Feb. 15, 2019, 8:05 p.m. political

Tpcc loksabha priparation meeting

హైదరాబాద్ : రాబోయే లోక్‌స‌భ సాధార‌ణ ఎన్నిక‌ల‌లో ఎఐసిసి అధ్య‌క్షులు రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిగా చేసేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృత‌నిశ్చ‌యంతో ప‌నిచేయాల‌ని, ప్ర‌తి వ్య‌క్తిని క‌లిసి బిజెపిని ఓడించేందుకు రాహుల్‌ను ప్ర‌ధానిని చేసేందుకు కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌ని టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్ర‌ధాన కార్యద‌ర్శి ఆర్‌.సి కుంటియాలు పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నాడు గ‌చ్చిభౌళిలోని ఒక హోట‌ల్‌లో పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మేధో మ‌ధ‌నం ప్రారంభ‌మ‌య్యింది. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన ఉత్త‌మ్ కాశ్మీర్ పూల్వామా ద‌గ్గ‌ర  జ‌రిగిన సిఆర్‌పిఎఫ్ జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదుల దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్ర‌వాదుల దాడిలో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల‌కు నివాళులు అర్పించి సంతాప సూచ‌నంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. 

ఈ స‌మావేశానికి టిపిసిసి కార్య నిర్వాహ‌క అధ్య‌క్షులు కుసుమ కుమార్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, సి.ఎల్‌.పి నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షులు పొన్నం ప్ర‌భాక‌ర్‌,  ఎఐసిసి కార్య‌ద‌ర్శులు శ్రీ‌నివాస  కృష్ణ‌న్‌, మ‌ధు యాష్కి, సంత‌ప్ కుమార్‌, వంశీ చంద‌ర్ రెడ్డి, వి. హ‌నుమంత‌రావు, జీవ‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. మొద‌టి రోజు ముందుగా ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, మెద‌క్‌, జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు జ‌రిగాయి. ఈ స‌మావేశంలో ఒక్కొ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మండ‌ల అధ్య‌క్ష‌లు, బ్లాక్ అధ్య‌క్షులు, ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన అభ్య‌ర్థులు, పార్లమెంట్ స్తాయి నాయ‌కులు, పిసిసి, ఎఐసిసి నాయ‌కులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెండు జాతీయ పార్టీల మధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుక‌ళ్లాల‌ని, మోడీకి, రాహుల్‌కు మ‌ధ్య జ‌రిగే ఎన్నిక‌ల‌లో రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిగా చేసేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని సూచించారు. నరేంద్ర‌మోడీ గ‌త ఎన్నిక‌ల‌లో అనేక ర‌కాల హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి ఓట్లు పొందింద‌ని, 130 ఏళ్ళ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్న‌డు మ‌తాన్ని రాజ‌కీయాల‌కు కోసం ఉప‌యోగించ‌లేద‌ని, కానీ మ‌త‌న్నా ఆదారంగా చేసుకొని దేశంలో చీలిక‌లు తెచ్చిన ఘ‌న‌త బిజెపికి ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

Troll congress

గ‌త ఎన్నిక‌ల‌లో నరేంద్ర‌మోడి ఇచ్చిన ఒక్క హారి నెర‌వేర్చ‌లేద‌ని న‌ల్ల‌ద‌నాన్ని అరిక‌డ‌తాన‌ని బూట‌క‌పు హామీలు ఇచ్చిన మోడీ విదేశాల నుంచి తెచ్చిన న‌ల్ల‌ధ‌నంలో ఒక్కొ పౌరుని ఖాతాలో 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని  కానీ ఒక్క పైసా జ‌మ చేయ‌లేద‌ని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చిన మోడీ రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు చేసి దేశాన్నిఆర్థికంగా దివాళా తీశార‌ని, కార్పోరేట్ కంపెనీల‌కు దాసోసం చేసి దేశాన్ని అవినీతి మ‌యం చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. న‌రేంద్ర‌మోడి చేసిన అవినీతిని ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని, ఆయ‌న ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన విధానాన్ని తెలిపి రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రి చేయ‌డంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వాములు కావాల‌ని ఆయ‌న అన్నారు. 

దేశంలో ప్ర‌జ‌లు రాహుల్‌ను ప్ర‌దానిని చేయాల‌ని చూస్తున్నార‌ని అందులో తెలంగాణ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెద్ద ఎత్తున ఉండేలా చూడాల‌ని అన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ల స్థానిక స‌మ‌స్య‌లు ప్ర‌భావం చూప‌వ‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇవి భిన్నంగా ఉంటాయ‌ని జాతీయ అంశాలే ప్రాధాన్య‌త ఉంటాయ‌ని ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లాల‌ని అన్నారు. దేశంలో మైనారిటీలు అభ‌ద్ర‌త‌లో ఉన్నార‌ని, తెలంగాణ‌లో అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌లో మైనారిటీలు ప్రాధాన్య‌త గా ఉంటార‌ని వారి ఓటు కాంగ్రెస్ వైపు వ‌చ్చేలా కార్య‌క‌ర్త‌లు చూడాల‌ని సూచించారు. 8 దేశంలో మ‌తాన్ని రెచ్చ‌గొట్టి ఓటు పొందాల‌ని బిజెపి చూస్తుంద‌ని లౌకిక వాధం పునాధిగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్ర‌తి పౌరుని హ‌క్కుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి కార్య‌క‌ర్త‌లు బ‌లంగా తీసుకెళ్లాల‌ని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాల‌యింద‌ని, అందుకు చాల కార‌ణాలున్నాయ‌ని, వాటిలో ఇవిఎం, వివిప్యాట్‌లు, ఓట‌ర్ల తొల‌గింపు, అధికార దుర్వినియోగం లాంటి అనేక కార‌ణాలు కూడా కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయ‌ని అన్నారు. అలాగే ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వం రైతుల‌కు రైతు బంధు నిధులు విడుద‌ల చేసింద‌ని, నేరుగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాల వ‌ల్ల కొంత ఓట‌ర్లు టిఆర్ ఎస్ వైపు మొగ్గు చూపార‌ని ఆయ‌న వివ‌రించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను జ‌ర‌గ‌కుండా కార్య‌క‌ర్త‌లు చాల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. ఈ ఎన్నిక‌ల‌ను జాతీయ స్థాయి ఎన్నిక‌లుగా, మోడీ, రాహుల్ మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా కాంగ్రెస్ విజ‌యావ‌కాశాల‌ను మెరుగు ప‌రుచుకోవ‌చ్చున‌ని అన్నారు.  

ఎఐసిసి ఇంచార్జ్ కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా మాట్లాడుతూ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌ది మంది ముఖ్య నాయ‌కుల‌తో ఈ స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని, కింది స్తాయిలో ఉన్న అంశాల‌తోపాటు కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి స‌హ‌క‌రించే విష‌యాల‌ను వివ‌రించాల‌ని సూచించారు. నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌చ్చిన నాయ‌కులు మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గాల‌లో విభేదాలు లేకుండా అంద‌రు క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేసేలా చూడాల‌ని సూచించారు. అభ్య‌ర్థుల‌ను వెంట‌నే ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ప్ర‌చారానికి స‌మ‌యం దొరుకుతుంద‌ని, అలాగే ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ప్ర‌జ‌ల‌లో మంచి ఆద‌ర‌ణ పొందేలా చూడాల‌ని, రెబ‌ల్ అభ్య‌ర్థులు లేకుండా పార్టీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. 

tags: Utham Kumar Reddy, tpcc meeting, Telangana Lok Sabha, Kashmir blast, Jawan dead body's, Rahul Gandhi , Sonia Gandhi, kunthiya, Telangana Congress , batti vikramarka, clp leader.

Related Post