కేసీఆర్ ఫ్రంట్ కు కొరవడిన మద్దతు

news02 May 18, 2019, 8:50 p.m. political

Cm kcr U-turn on National federal front

ఫెడరల్ ఫ్రంట్ పాట పాడుతున్న కెసిఆర్...రూటు మార్చారా....? కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లిన గులాబీ బాస్.. ఇప్పుడు ట్రాక్ చేంజ్ చేస్తున్నారా.. అంటే రాజ‌కీయ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. కాంగ్రెస్ అనుకూల పార్టీలను కలవటంలో మతలబు ఇదే ఉండొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు కేసీఆర్ వ్యూహం ఏంటి?

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు తానే నాంది పలుకుతానంటూ కెసిఆర్ ముందుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ కట్టి ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే కసరత్తు చేశారు. ఇక మేధావులు, నిపుణులతో దేశంలోని సమస్యలు, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలపై అనుసరిస్తున్న వైఖరి తదితరుల అంశాలపై చర్చించి ఎజెండాను తయారు చేసుకున్నారు.అనంతరం పలు రాష్ట్రాలు తిరిగి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకమన్న భావనను తీసుకువచ్చారు.కానీ తాజా రాజకీయ పరిణామాలతో కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

రాష్టంలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని సర్వేలు చేయించారు. కర్ణాటక, ఏపీ, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఒడిశా తో మరికొన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించుకునే పనిలో ఉన్నారు కేసీఆర్...యూపీఏ వైపు ఉన్న పార్టీలేవి...అదే సమయంలో ఎన్డీయే వైపు ఉన్న పార్టీల బలాబలాలను ఈ సర్వేల ద్వారా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

తాజా రాజకీయ పరిణామాలను సమీక్షించిన తర్వాత...ఏ రాష్ట్రానికి వెళ్ళాలి....ఎవరిని కలవాలనె పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చెన్నైలో స్టాలిన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఫలితాల కంటే ముందే అందరిని కలిసి...కాంగ్రెస్, బిజెపిలకు మెజార్టీ రాకపోతే ఆల్టర్ నెట్ గా ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్రంట్ గా ముందుకు వెళ్లాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం గా తెలుస్తోంది. ఆయన భేటీలు ఎన్డీయే కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారా...లేక యూపీఏ వైపు అడుగులు వేస్తున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది.

బిజేపి, కాంగ్రెస్ లు సొంతంగా 150 సీట్లు దాటితే తప్ప ఆ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీ లు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండటం తో.. కేసీఆర్ కూడా రెండు మూడు ప్లాన్ లతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫెడరల్ ఫ్రంట్ .. లేకపోతే పరిస్థితులు బట్టి .. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ కేసీఆర్ టీం లో జరుగుతోంది.7 కాంగ్రెస్, బిజేపీ కి సరైన మెజార్టీ రాకపోతే.. ఇప్పుడు ఆయా పార్టీ లకు మద్దతిస్తున్న వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ లు కూడా స్టాండ్ మార్చుకునే అవకాశం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీ లకు సరైన మెజార్టీ రాకపోతే తన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు వస్తుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రిజ‌ల్ట్ వ‌ర‌కు ఈ ఫ్రంట్‌ వేడిని కొన‌సాగిస్తే.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత ఫ్రంట్ టెంట్ లోకి వ‌చ్చే వారిని అహ్వానించ‌ట‌మా లేక‌.. అంద‌రితో పాటు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న కేంద్ర పార్టీ కి మ‌ద్ద‌తియ్య‌ట‌మే త‌ప్ప మ‌రో అవ‌కాశం లేద‌ని టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈ సారి కేంద్రంలో టీఆర్ ఎస్ బాగ‌స్వాయం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కేసీఆర్ నిర్ణ‌యాలుంటాయ‌ని చెబుతున్నారు.

tags: Cm kcr , kcr cabinet ministers, Telangana cabinet portfolios, cm kcr family, Harish Rao portfolios, minister Harish Rao, Telangana governament, MLA malla Reddy, Thalasani Srinivas Yadav, Indrakaran, MP Vivek, Gaddampalli Vivek, TRS loksabha candidates, pragathibavan, federal front, pm kcr, kcr front , natinonal front.

Related Post