ప‌ల్లెల్లో ఓట్ల పంచాయితీ ..

news02 Jan. 2, 2019, 10:36 p.m. political

panchayathi elections, panachayathi raj, secretory, nagireddy, telangana

హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నిక‌లు మూడు విడ‌త‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి విడ‌త  జనవరి 21, రెండ‌వ విడ‌త‌ 25, మూడ‌వ విడ‌త‌ 30 తేదీల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి  షెడ్యూల్డ్ ను విడ‌ద‌ల చేశారు. మూడు విడ‌త‌ల‌కు సంబంధించి  ఈనెల 7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్‌ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఉద‌యం ఎడు గంట‌ల నుండి.. ఒంటి గంట వ‌ర‌కు పోలిగ్ జ‌ర‌గ‌నుంది. రెండు గంట‌ల నుండి.. కౌంటింగ్ ప్రారంబించి ఫ‌లితాల‌ను ప్రక‌టించి.. అదే రోజు ఉప స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను కూడా పూర్తి చేస్తారు. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎడ‌మ చేతి చూపుడు వేలుకు సిరా వేసినందున్న‌.. ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో చూపుడు వేలుకు కాకుండా.. మ‌ధ్య వేలుకు సిరా ను వేయ‌నున్నారు. 

panchayathi_elections_ink, poling, villeges, telengana
తెలంగాణ వ్యాప్తంగా  మొత్తం 12 751 పంచాయితీల‌కు గాను..12 732 పంచాయితీల‌కు ఎన్నిక‌లు  జ‌ర‌గ‌నున్నాయి. ఇంకా గడువు ముగియక పోవడం కార‌ణంగా 17 పంచాయతీల్లోను,కోర్టు కేసుల కారణంగా మరో రెండుచోట్ల ఎన్నికలను నిర్వహించడంలేదు. ఈ ఎన్నిక‌ల్లో  1.49 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా  ఎన్నిక‌ల సంఘం గుర్తించిన 18 రకాల కార్డుల్లో ఏదో ఒకటిని చూపించు ఓటును వియోగించుకోవ‌చ్చు. ఈ ఎన్నిక‌లు బ్యాలెట్ ప‌ద్ద‌తిలో జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల సంఘ పంచాయితీ షెడ్యూల్గ్ ను ప్ర‌క‌టించ‌డంతో.... రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది.

tags: panchayathi_elections, telangana, governament, kcr, cm, stete election commission, nagireddy ballet,

Related Post