టీఆర్ ఎస్ ఎంపీగా ప్ర‌కాశ్ రాజ్

news02 April 18, 2018, 7:40 p.m. political

prakash raj close with cm kcr

హైద‌రాబాద్ః విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఎంపీగా పోటీ చేయబోతున్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా టీఆర్ ఎస్ పార్టీ నుంచి. కొన్నిరోజులుగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో క‌లిసి తిరుగుతున్న ప్ర‌కాశ్ రాజ్‌.. గులాబీ పార్టీ నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే త‌న మ‌స‌స్సులోని మాట‌ను కేసీఆర్ కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

prakash raj contesting

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌కాశ్ రాజ్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. షాద్ న‌గ‌ర్ స‌మీపంలోని కొండారెడ్డి ప‌ల్లి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు. ఆ గ్రామంలో ప‌లు అభివృద్థి ప‌నుల‌ను ప్రకాశ్ రాజ్ చేప‌ట్టారు. ఆ గ్రామం ప‌రిస‌రాల్లోనే ప్ర‌కాశ్ రాజ్ కు ఫాం హౌజ్ ఉంది. దీంతో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం త‌న‌కు సెట్ అవుతుంద‌ని ప్ర‌కాశ్ భావిస్తున్నారు.

prakash raj with cm kcr

థ‌ర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో బాగంగా ప్ర‌కాశ్ రాజ్ సీఎం కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌య్యారు. కేసీఆర్ తో పాటే బెంగుళూరు వెళ్ళి దేవ‌గౌడ‌ను కలిశారు. అప్ప‌టి నుంచి రోజూ ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ప్రకాశ్ రాజ్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ వెంటే ఉండి ఆయ‌న‌తో పాటు క‌లిసి భోజ‌నం చేయ‌టం.. ఫాం హౌజ్ కు వెళ్ళ‌టం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు.. ప్ర‌కాశ్ రాజ్ కు మ‌ధ్య సానిహిత్యం పెరిగింద‌ని టీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్నారు.  

Related Post