కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం

news02 Nov. 1, 2018, 7:08 p.m. political

uttam

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను ఈనెల 8లేదా 9వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు.. అభ్యర్దుల జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు తాము కసరత్తు చేసిన అభ్యర్జుల జాబితాపై క్లారిటీ వచ్చిందని ఉత్తమ్ చెప్పారు. ఐతే అభ్యర్ధుల జాబితా మొత్తం ఒకేసారి విడుదల చేయాలా.. లేక విడతల వారిగా అభ్యర్ధులను ప్రకటించాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పీసిసి చీఫ్ అన్నారు. 

uttam

ఈ విషయంపై ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 95 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ చెప్పారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాాయని ఆయన స్పష్టం చేశారు. అటు తెలుగుదేశం పార్టీకి 14 సీట్లను కెటాయించేంందుకు అధిష్టానం అంగీకరించిందని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలకు సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదన్న పీసిసి చీఫ్.. త్వరలోనే దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈనెల 8న మరోసారు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే అభ్యర్ధుల తుది జాబితాకు ఆమోద ముద్ర వేయనున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
 

tags: congress candidates list announcing in november 8th, uttam about congress candidates list, congress central election committe, uttam about mahakutami seats

Related Post