అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే..

news02 Nov. 5, 2018, 7:46 p.m. political

uttam

డిసెంబర్ 12న మహాకూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు.  ప్రధాని మోదీ- కేసీఆర్ లు రహస్య ఎజెండాతో ముందుకెళ్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ప్రజలు అమరావతికి లేదా ఢిల్లీకి వెళ్లాలని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పికొట్టారు పీసిసి చీఫ్. అలా అర్దం పర్దం లేకుండా మాట్లాడేందుకు టీఆర్ ఎస్ నేతలకు సిగ్గూలజ్జా ఉండాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో నరేంద్ర మోదీకి తాకట్టుపెట్టింది కేసీఆర్ కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

uttam 

విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలపై కేసీఆర్ కేేంద్రంతో ఎందుకు పోరాడలేదని నిలదీశారు కెప్టెన్ ఉత్తమ్. తెలంగాణలోని ముస్లిం, మైనార్టీలను మోసం చేయడానికి, లోక్ సభ ఎన్నికల్లో మోదీతో కలిసిపోయేందుకు ఈ ముందస్తు ఎన్నికలు వచ్చాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మొన్న కేంద్రంలో బీజేపీ సర్కార్ పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిచ్చిన సంగతిని ఉత్తమ్ గుర్తు చేశారు, అవిశ్వాస తీర్మాణం సమయంలో పాల్రమెంట్ లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం బాగుందంటూ పొగిడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని పీసిసి చీఫ్ మండిపడ్డారు. కేసీఆర్ లా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 

tags: pcc chief uttam, captain uttam, captain uttam kumar reddy, uttam fire on cm kcr, uttam fire on kcr, uttam fire on trs, pcc chief uttam fire on kcr, uttam comments on kcr

Related Post