రీడిజైనింగ్ దోపిడిని ఎండగట్టారు..

news02 Aug. 15, 2018, 1:14 p.m. political

rahul

రాహూల్ గాంధి రెండు రోజుల పర్యటన అధ్బుతంగా కొనసాగిందని పీసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి రాహూల్ గాంధి పర్యటనకు మంచి స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. రాహూల్ విశ్వసనీయతపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ఉత్తం అన్నారు. రాహూల్ గాంధీ పర్యటన సీఎం కేసీఆర్ లో దడ పుట్టించిందని.. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ ల రీడిజైనింగ్ దోపిడిని రాహూల్ బాగా ఎెండగట్టారని ఉత్తం పేర్కొన్నారు. మహిళా సంఘాల బకాయిలు వెంటనే 960 కోట్లు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమన్న ఉత్తం.. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతిహామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఎల్బీనగర్ లో నిర్వహించిన నిరుద్యోగ సభ కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.

uttam

ఇక వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్స్ ను వెయ్యి నుంచి రెండువేలకు పెంచుతామని ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించడం సిగ్గుచేటన్న ఉత్తం.. ఎంప్లాయిమెంట్ లో రిజిష్టర్ అయిన నిరుద్యోగులకు నెలకు మూడువేలు ఇచ్చి తీరుతామని అన్నారు. ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని.. సెప్టెంబర్ లో అభ్యర్థులను ప్రకటిస్తామన్న పీసిసి చీఫ్.. రాష్ట్రంలో పొత్తులపై పార్టీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేటీఆర్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు చిల్లర వ్యాఖ్యలని ఉత్తం విమర్శించారు.

rahul tour

వచ్చే నెల ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ మరోసారి తెలంగాణ లో పర్యటిస్తారని పీసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో బస్సు యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పిన ఉత్తం.. రాహూల్ వచ్చినప్పుడు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై రాహూల్ గాంధీ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితిపై రాహూల్ స్వయంగా సంతోషం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ లో రాహూల్ గాంధి తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు టీఆర్ ఎస్ సభ కంటే భారీ స్థాయిలో భహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఉత్తం అన్నారు. 

rahul

ఇక తాము ఇస్తున్న ఎన్నికల హామీలన్ని పూర్తి అధ్యయం చేసిన తరువాతే ప్రకటిస్తున్నామని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫి, నిద్యోగులకు భృతి పెద్ద కష్టమేమి కాదాని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి కోసం యేడాదికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుందని ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రాబోవు న్నికలలో పోటీ సేచే అభ్యర్ధుల ప్రకటన కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ లోనే అభ్యర్ధులు ప్రకటిస్తామని ఉత్తం అన్నారు.
 

tags: uttam , uttam kumar reddy, uttam on rahul, uttam about rahul, uttam on rahul tour, uttam about rahul tour, uttam fire on ktr, uttam fire on kcr

Related Post