కేసీఆర్ కు పాలనపై పట్టులేదన్న రేవంత్ రెడ్డి

news02 March 15, 2018, 3:47 p.m. political

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేసీఆర్ తప్పుడు లెక్కలు, మాయమాటల బడ్జెట్ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేసే విధంగా బడ్జెట్ ఉందని ఆయన ఆరోపించారు. అప్పులు తేవడం…అడ్డగోలుగా ఖర్చు చేయడమే కేసీఆర్ కు తెలుసన్న రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో కాంగ్రెస్ చేపట్టిన దీక్షకు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు  ప్రశ్నలు సంధించారు.

కేసీఆర్ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలు, రైతు కుటుంబాలు, నిరుద్యోగులు అంటే లెక్కలేకుండా పోయిందని ఈ బడ్జెట్ ద్వారా తేలిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ బడ్జెట్ తో మోడీకి పట్టిన గతే రేపు కేసీఆర్ కు పడుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించిన నిధులు రూ.49 వేల ఇండ్లకు సరిపోవన్న రేవంత్ కేసీఆర్ మూడు లక్షల ఇళ్లు ఎలా కడతారని ప్రశ్నించారు. 2016-17లో కేంద్రం ఇచ్చిన రూ.6వేల కోట్లనే మళ్లీ దారి మళ్లించారని రేవంత్ అన్నారు. ప్రతిపాదనలు… సవరణలపై అంచనాలు లేకుండా .. పాలనపై పట్టులేకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని పాలిస్తున్నారని  విమర్శించారు. సమగ్ర సర్వే ప్రకారం ఉన్న నాలుగు లక్షల భూమిలేని దళితులకు కేసీఆర్ ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమన్న రేవంత్  ఈ బడ్జెట్ లో రైతులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు.ఈ  బడ్జెట్ లో అమరవీరుల కుటుంబాలకు ఏ నిధులు కేటాయించకుండా మళ్లీ మోసం చేశారన్నారు.

tags: revanthreddy. congress, budjet, trs, assembly

Related Post