హ‌రీష్ రావును టార్గెట్ చేసిన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌

news02 May 9, 2018, 9:24 p.m. political

Target harish rao

టీఆర్ ఎస్ లో జ‌రిగే గూడు పుఠాని గురించి బ‌య‌టికి ఏవేవో ఊహాగానాలు వినిపిస్టుంటాయి. వాటిని ఎవ‌రు ఖండించ‌రు. స‌మ‌ర్ధించ‌రు. కాని పార్టీలో నేత‌లు కేటీఆర్ వ‌ర్గం, హ‌రీష్ రావుగా విడిపోయి మ‌సులుకుంటార‌న్న‌ది సుస్ప‌ష్టం. అయితే హ‌రీష్ రావు  విష‌యంలో మాత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ పెద్ద‌లు కొద్దిగా మొర‌టుగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది మాత్రం పార్టీలో వినిపించే మాట‌. ఈ మ‌ధ్య కాలంలో హ‌రీష్ రావును ప్ర‌గ‌తి భ‌వ‌న్ టార్గెట్ చేస్తోందని వాద‌న గ‌ట్టిగా వినిపిస్తోంది.

Cm kcr family

హ‌రీష్ రావు క‌దిలిక‌ల‌పై ఎప్పుడూ ఇంట‌లిజెన్స్ రిపోర్టులు తెప్పించుకోవ‌టం.. ఏమాత్రం తేడా వ‌చ్చినా వెంట‌నే సంజాయిషీ అడ‌గటం ష‌రా మూములుగా మారిపోయింద‌ట‌. ఈ మ‌ధ్య 30 మందితో హ‌రీష్ రావు బీజేపీలో చేరుతార‌ని ఏదో ఒక వెబ్ సైట్ లో రాగానే పార్టీ అధిష్టానం హ‌రీష్ రావుపై ఊగిపోయింద‌ట‌. ఈ వార్త‌కు సంజాయిషీ ఇవ్వాల‌ని ఇబ్బంది పెట్టార‌ట‌. దీంతో రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌పై పెద్ద‌గా స్పందిచ‌ని హ‌రీష్ రావు .. అయిష్టంగానే తాను ఏ పార్టీలో చేర‌న‌ని త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు టీఆర్ ఎస్ లోనే కొన‌సాగుతాన‌ని చెప్పుకున్నాడు. మ‌రో సారి ఇలాంటి వార్త‌లు త‌న‌పై రాస్తే కేసుకూడా పెడ‌తాన‌ని చెప్పాడు. అయితే ఈ వ్య‌వ‌హారం ఇంకా ముగియ‌క‌ముందే టీఆర్ఎస్ గుర్తింపు సంఘం నే అశ్వ‌ద్ధామ రెడ్డి ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డిస్తామ‌ని హెచ్య‌చిరంచ‌టంతో వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింద‌ట‌.

Mp kavitha family

హ‌రీష్ రావు సింప‌తైజ‌ర్ అయిన అశ్వ‌ద్దామ రెడ్డి ప్ర‌గతి భ‌వన్ ముట్ట‌డిస్తాన‌ని చేసిన హెచ్చరిక వెనుక మంత్రి హ‌రీష్ రావు ఉన్నార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో సీఎం కేసీఆర్ చుట్టూ ఉంటే ప్ర‌గ‌తి భ‌వ‌న్ కోట‌రీ హరీష్ రావు ను టార్గెట్ చేస్తోంద‌ట‌. హ‌రీష్ రావు చుట్టు ఉంటే ఆయ‌న బ‌లాన్ని దూరం చేసేందుకు ఎత్తులు పైఎత్తులు వేసే ఆయ‌న వ్య‌తిరేఖ వ‌ర్గం ఆయ‌న రెక్క‌లు క‌ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట్లో హ‌రీష్ రావు అనుచ‌రిడిగా ఉన్న బొంతు రామ్మోహ‌న్ కు మేయ‌ర్ ప‌ద‌వి ఇచ్చి కేటీఆర్ వ‌ర్గంలోకి మార్చుకున్నార‌నే చ‌ర్చ ఉండ‌నే ఉంది. ఈమ‌ధ్య మంత్రికి మంచి పేరు రావ‌టంతో త‌న‌దైన స‌హాయం చేసిన పీఆర్ ఓ జ‌కీర్ ను కూడా ప్ర‌గతి భ‌వ‌న్ వ‌ర్గాలు చిన్న‌దాన్ని భూదత‌ద్దంలో చూపి దూరం చేసింద‌ని హ‌రీష్ రావు వ‌ర్గాలు భావిస్తున్నారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ కోట‌రీ విష‌యంలో మంత్రి హరీష్ రావు చాలా సార్లు మ‌న‌స్థాపానికి గురైన‌ట్లు స‌మాచారం. వీళ్ళ క‌ళ్ళ‌ముందు ఉండ‌కూద‌డ‌నే మంత్రి హ‌రీష్ రావు ప‌గ‌ల‌న‌క‌ర‌రాత్ర‌న‌క ఏదో ఒక ప‌ని క‌ల్పించుకొని తిరుగుతున్నాడ‌నే చ‌ర్చ కూడా గులాబీ వ‌ర్గాల్లో ఉంది. కేటీఆర్ ను ముఖ్య‌మంత్రి చేసే వ‌ర‌కు హ‌రీష్ రావును కంట్రోల్ చేయాల‌నే వ్యూహం ఉండ‌వ‌చ్చ‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ ఎస్ లో గుమ్మ‌నంగా ఈ వ్య‌వ‌హారం ముదురుతుండ‌టం ఎక్క‌డికి దారి తీస్తుందో మ‌రి.  

 

tags: cm kcr, ktr, harish rao, pragatrhi bavan, target, trs internal, ktr war, zakir, pro zakir,

Related Post