ముందస్తు పై ఢిల్లీలోనే తేల్చుకుంటారా..

news02 Aug. 23, 2018, 9:35 p.m. political

CM KCR for early elections

హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా.. వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ముందుకు వెళ్తే లాభమా.. నష్టమా అని ఒకవైపు ముందు వెళ్లేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశం మరోవైపు సీఎం కేసీఆర్ ను మెదడును తొలుస్తున్నాయి . డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలనేది సీఎం కేసీఆర్ కోరికగా తెలుస్తోంది. అయితే ఢిల్లీలో రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో ముందుకు వెళ్లాలా వద్దా అని కేసీఆర్ సంషయ పడుతున్నారు.

CM KCR Delhi tour

వచ్చేనెల రెండో వారంలో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్ లో వచ్చే ఎన్నికల తో కలిపి ఎలెక్షన్ కు పోవచ్చు అని ఒక అంచనా కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత నాలుగు రాష్ట్రాల ఎన్నికల వాయిదా పడితే మొదటికే మోసం వస్తుంది.ఒకసారి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వ్యవహారమంతా ప్రధాని మోడీ చేతుల్లోకి వెళ్తే అప్పుడు ఇక్కడ చేసేది ఏమిలేదు .. ఢిల్లీ పెద్దలు ఏది చెబితే అదే వినాలి అందుకే ఢిల్లీ పరిణామాలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు.

Cm kcr Delhi tour

బుధవారం మంత్రులతో సమావేశం కావడం గురువారం గవర్నర్ తో మంతనాలు జరపడం, శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలతో సమావేశం కావడం వెంటనే ఢిల్లీకి వెళ్లడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. గవర్నర్ తో కూడా ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం . అయితే గురువారం సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు నమ్మినబంటు అయిన మాజీ సీఎస్ ప్రస్తుత ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఎన్నికల సంఘాన్ని కలిశారు. శర్మ కూడా ముందస్తు ఎన్నికల అంశంపై ఆరా తీసేందుకే ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కి పయన మైన కెసిఆర్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి విభజన చట్టంలోని హామీలపై మాట్లాడేందుకు అని సీఎం కార్యాలయం మీడియాకు సమాచారం ఇచ్చింది. కానీ ప్రధానితో జరుపుతున్న రహస్య మంతనాల్లో భాగంగానే మోడీ ని కలవబోతున్నట్లు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికలపై ఏదో ఒకటి తేల్చుకునేందుకే హస్తిన బాట పట్టినట్లు కేసీఆర్ కదలికలను బట్టి తెలుస్తోంది.

TRSLP meeting

ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అని చర్చలు జరుగుతున్నా లోపలలోపల ఏదో జరుగు తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం కేసీఆర్ బైటికి పొక్కకుండా ముందస్తు ఎన్నికల కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. సొంత క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తన మనసులో ఉన్న మాట తెలియకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ ఇస్తరేమోనని అనుకుంటున్నారు ఆయన సన్నిహితులు .

tags: CM KCR Delhi tour, Telangana Assembly Elections, CM KCR meet governor, CM KCR meet pm Narendra Modi, CM KCR Delhi tour, TRSLP meeting, Telangana elections, Telangana politics, CM KCR with party leaders, Pragathi Bhavan address, CM KCR cabinet, Telangana Cabinet meeting, CM KCR family, KCR daughter Kavitha, KCR son KTR, CM KCR live.

Related Post