వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన యూత్‌ కాంగ్రెస్ నేత‌లు

news02 July 9, 2018, 5:59 p.m. political

telangana youth congress rally grand success

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ... తెలంగాణ యువ‌జ‌న కాంగ్రెస్ సోమ‌వారం భార‌త్ బ‌చావో పేరుతో నిర్వ‌హించిన బైక్ ర్యాలీ గ్రాండ్ స‌క్సెస్ అయింది. బహదూర్‌పురా నుంచి గాంధీ భ‌వ‌న్‌ వ‌ర‌కు కొన‌సాగిన ఈర్యాలీలో యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభం నుంచి ర‌హ‌దారుల‌న్నీ యూత్ కాంగ్రెస్ నేత‌ల నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిపోయాయి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్‌, సోనియాగాంధీ, రాహుల్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాంటూ...రోడ్ల‌న్నీ నినాదాల‌తో మ‌ర్మోగిపోయాయి. 

youth congress meeting

అనంత‌రం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన యూత్ కాంగ్రెస్ నేత‌ల మీటింగ్‌కు ప‌లువురు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల‌తో పాటు...తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, యువజన కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు కేశవ్ చంద్ యాదవ్, యువజన కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బివి శ్రీనివాస్, తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీలు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా యూత్ కాంగ్రెస్ నాయ‌కుల‌కు వారు దిశానిర్ధేశం చేశారు. యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కులు..నేత‌ల చుట్టూ...తిర‌గ‌కుండా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని సూచించారు. దీంతో పాటు కేంద్ర‌, రాష్ట్ర స‌ర్కార్లు అనుస‌రిస్తూ...ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ పోరాటాల‌ను మ‌రింత ఉధృతం చేయాల‌ని పేర్కొన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై అన‌వ‌స‌ర‌పు విమ‌ర్శ‌లు చేస్తున్న...కేటీఆర్‌ను ఎక్క‌డిక్క‌డ ఘెరావ్ చేయాల‌ని సూచించారు.

telangana youth congress rally in hyderabad

మ‌రోవైపు భారత్ బచావో సభ తరువాత చలో ప్రగతి భవన్‌కు యూత్ కాంగ్రెస్ నాయ‌కులు పిలుపునివ్వ‌డంతో..కాసేపు ఉద్రిక్త‌ ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో వేదిక దిగిరాగానే కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కుల‌ను పోలీసులు గేటు వ‌ద్దే అదుపులోకి తీసుకున్నారు.

 

tags: youth congress bharat bachavo bike rally,

Related Post