హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కేసీఆర్ సీఎం పదవి చేపట్టి 4 ఏళ్లు పూర్తైనా... ప్రజలకు ఒరగబెట్టిందేం లేదన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై ఆలోచనే లేదని... ఆయన దృష్టంతా తన కుటుంబాన్ని బాగు చేసుకోవడంపైనే పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి పాలన మొత్తం దోచుకోవడం... దోచుకున్న దాన్ని దాచుకోవడానికే సరిపోతుందన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆ నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారని... మిగతా ప్రజలెవ్వరూ ఆనందంగా లేరన్నారు. వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో... కేసీఆర్ సక్సెస్ అయ్యారని.. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, 2019 ఎన్నికల్లో అలాంటీ పరిస్థితి ఉండబోదన్నారు. ఇటీవల జరిగిన సర్వేలు కూడా ఇవే విషయాలు చెబుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కోన్నారు.