ఎగ్డిట్ పోల్స్ ను నమ్మకండి

news02 May 21, 2019, 6:29 a.m. political

shahsi

 

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిశాక వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో మెజార్టీ సర్వే సంస్థలన్నీ ప్రజలు బీజేపీవైపే మొగ్గు చూపారని చెబుతున్నా.. చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్బాలను చూశాం  అయితే ఈ ఎగ్జిట్‌ పోల్ ఫలితాలతో  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నేతలు విభేదిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ సీనియర్ నేత శశి థరూర్‌ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని చెబుతున్నారు. ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు కావాలంటే మే 23 వరకు ఆగాల్సిందేనని ధరూర్ అన్నారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలన్నీ తప్పని తన నమ్మకమన్న శశి ధరూర్.. గత వారాంతంలో ఆస్ట్రేలియాలోనూ వివిధ ఎగ్జిట్‌ పోల్స్‌ ఒక రకంగా చెప్తే.. ఫలితం మరోలా వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా భారత దేశంలో చాలా మంది ఓటర్లు తామెవరికి ఓటేశామో చెప్పడానికి ఇష్టపడరని శశిధరూర్ అన్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తెలియాలంటే మాత్రం ఈనెల 23 వరకు ఆగాలని ఆయన చెప్పారు.
 

tags: shashi, shashi tharur, shashi tharur on exit polls, shasi tharur about exit polls, exit polls, ap exi polls

Related Post