మతం వేరు.. రాజకీయం వేరు

news02 July 5, 2019, 7:15 a.m. political

nusrat jahan

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ సంచలనాలకు కేంద్ర బిందువు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఎంసీ తరపున ఎంపీగా గెలిచిన ఈ ముస్లిం మహిళ ఆ తరువాత ఓ హిందువును పెళ్లి చేసుకుంది. అంతే కాదు నుస్రత్‌ జహాన్‌.. నుదుట కుంకుమ, మెడలో తాళిబొట్టుతో పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేసింది. దీంతో సొంత సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యింది. ముస్లిం మత పెద్ద ఆమెకు పత్వా కూడా జారీ చేశారు. మత సంప్రదాయాలను మంటగలిపారని ఆగ్రహం వ్కక్తం చేశారు. అయినప్పటికీ నుస్రత్‌ జహాన్‌  లెక్కచేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ యువ ఎంపీ. కోల్ కత్తాలోని ఆల్‌బర్ట్‌ రోడ్డులో ఇస్కాన్‌ కేంద్రం వద్ద జగన్నాథ రథయాత్రకు భర్త నిఖిల్‌ జైన్‌తో కలిసి హాజరైంది నుస్రత్‌ జహాన్‌. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించింది. మతం వేరు.. రాజకీయం వేరు.. లౌకిక, మానవత్వ సమాజం కోసం యువ భారత్‌ తపిస్తోంది. ఆ దిశగా కలిసిమెలిసి ముందుకెళ్దామని తనదైన శైలిలో చెప్పింది నుస్రత్‌ జహాన్‌.

nusrat jahan

tags: nusrat jahan, mp nusrat jahan, tmc mp nusrat jahan, nusrat jahan married hindu man, nusrat jahan about patwa, nusrat jahan comments on hindu religion

Related Post