రాష్ట్రం కోసం బాబు...మోదీ కోసం కేసీఆర్‌

news02 June 19, 2018, 1:35 p.m. political

chandra babu and kcr

ఢిల్లీ: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌నిత‌న‌మెందో మ‌రోసారి రుజువైంది. ఢిల్లీ వేదిక‌గా ఎవ‌రి చాతుర్యం ఏంటో తేలిపోయింది. ఆదివారం నీతిఆయోగ్ పాల‌క మండ‌లి సమావేశంలో చంద్ర‌బాబు రాజ‌నీతి విజ్ఞ‌తను ప్ర‌ద‌ర్శించ‌గా...కేసీఆర్ మాత్రం ప్లాప్ కావ‌డం విశేషం. ఈమీటింగ్‌లో చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్ట‌గా...కేసీఆర్ మాత్రం మోదీ జ‌పం చేయ‌డం విశేషం. 

kcr with modi

కేసీఆర్ ఓ మంచి అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడ‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి మీటింగ్‌లో ఆయ‌న జీరో ఫార్మామెన్స్‌ను క‌న‌బ‌ర్చ‌డం విశేషం. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టాల్సిన చోట...ఆశించిన మేర ప్ర‌జెంటేష‌న్ చేయ‌డంలో అడ్డంగా బోల్తాప‌డ్డారు. తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందించే కీల‌క‌మైన విష‌యాల‌ను ఆయ‌న నీతి ఆయోగ్ దృష్టికి తీసుకురాక‌పోవ‌డం దారుణం.  ఏపీ రీ-ఆర్గ‌నైజేష‌న్ బిల్లు-2014లో పొందుప‌ర్చిన హామీలను కూడా కేసీఆర్‌ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఘోరం. బిల్లులో పొందుప‌ర్చిన బ‌య్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, ట్రైబ‌ల్ వ‌ర్శిటీ వంటి వాటి ఉసే కేసీఆర్‌ ఎత్త‌క‌పోవ‌డం విశేషం. 

niti aayog meeting

బ‌య్యారం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం అనుమ‌తి ఇస్తే..తెలంగాణ‌లో ఉపాధి పెర‌గ‌డంతో పాటు...పెద్ద ఎత్తున ఇక్క‌డి యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీకి అనుమ‌తి వ‌స్తే...తెలంగాణ ఆర్థికాభివృద్ధి పెరిగే ఛాన్స్ ఉంది. ఇక గిరిజ‌న వ‌ర్శిటీ ఏర్పాటుకు కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేస్తే తెలంగాణ‌లో గిరిజ‌న‌, షెడ్యూల్ జాతుల అభివృద్ధికి బాట‌లు వేసిన‌ట్లు అయ్యేది. అయితే తెలంగాణ అభివృద్ధికి ఇంత కీల‌క‌మైన అంశాల‌పై కేసీఆర్ స‌మావేశం దృష్టికి తీసుకురాక‌పోవ‌డం దారుణం. అంతేకాదు మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కాల‌ను నీతి ఆయోగ్ రెక‌మండ్ చేసింద‌ని...మిష‌న్ భ‌గీర‌థ‌కు 20 వేల కోట్లు, మిష‌న్ కాక‌తీయ‌కు 5 వేల కోట్లు తేనున్న‌ట్లు కేసీఆర్ గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే కీల‌క‌మైన నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఈప‌థ‌కాల అంశం కూడా ఎత్త‌కుండా కేసీఆర్ తుస్సుమ‌నిపించారు. 

chandra babu

అయితే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్‌ను మించి ఫార్మామెన్స్‌ను ఇవ్వ‌డం విశేషం. కేసీఆర్‌లా వ్య‌క్తిగ‌త‌ ప‌థ‌కాల జోలికెళ్ల‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎదుర్కోంటున్న స‌మ‌స్య‌ల‌నే ఆయ‌న ఈస‌మావేశంలో చ‌ర్చించారు. నీతి ఆయోగ్ ఎజెండా, విధానాల‌ను కూడా బాబు ప‌క్క‌కు పెట్టి మ‌రి త‌న వాద‌న వినిపించారు. ఏపీ రీ ఆర్గ‌నైజేష‌న్ బిల్లు-2014లో పొందుప‌ర్చిన హామీల‌ను అమ‌లు చేయ‌మ‌ని చంద్ర‌బాబు గ‌ట్టిగానే వాదించారు. దాంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎందుకు ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మో గ‌ణంకాల‌తో స‌హా వివ‌రించారు. జీఎస్టీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉన్న ఇబ్బందులు, 15వ‌ ఆర్థిక సంఘం ఏపీ రీఆర్గ‌నైజేష‌న్ బిల్లును గౌర‌వించ‌క‌పోవ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ‌ర్ క్యాప్ట త‌క్కువ‌గా ఉండ‌డం వంటి అంశాల‌ను నీతి ఆయోగ్ స‌మావేశంలో చ‌ర్చించి స‌క్సెస్ అయ్యారు. 

dasoj sravan

అయితే ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు నీతి ఆయోగ్‌లో వ్య‌వ‌హ‌రించిన తీరుపైనే ఇప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. నీతి ఆయోగ్‌లో చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శించిన విజ్ఞ‌త‌ను మొచ్చుకుంటుండ‌గా...కేసీఆర్‌పై మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబులాగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించ‌డంలో కేసీఆర్ దారుణంగా విప‌ల‌మైయ్యాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. కేసీఆర్ స్వ‌లాభం కోస‌మే తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాడ‌ని తెలంగాణ కాంగ్రెస్ అధికారి ప్ర‌తినిధి దాసోజ్ శ్ర‌వ‌ణ్ కుమార్ అంటున్నారు. బీజేపీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా చూస్తున్న‌ప్ప‌టికీ...కేసీఆర్ మాత్రం మోదీ జ‌పం చేస్తుండ‌డం సిగ్గుచేట‌న్నారు. బీజేపీ-టీఆర్ఎస్‌కు మ‌ధ్య‌నున్న ర‌హ‌స్య ఎజెండాలో భాగంగానే కేసీఆర్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

tags: differences between kcr and chandrababu,chandrababu naidu niti aayog,niti aayog chandrababu naidu,kcr niti aayog,

Related Post