బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అత్యాచారాలు

news02 April 14, 2018, 9:12 p.m. political

Congress candle light raly

హైదరాబాద్ : మోడీ పాలనలో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే లే మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. మహిళపై అత్యాచారాలను అరికట్టడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు.దేశంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా...పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు నేతలు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానా రెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, దానం, పొన్నాల లక్ష్మయ్య ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా హక్కుల కోసం పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. బిజెపి అధికారం లో ఉన్న రాష్ట్రాల్లోని మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని సీఎల్పీ నేత జానా రెడ్డి అన్నారు. బీజేపీ సర్కార్ లో కాశ్మీర్లో మైనర్ బాలిక పైన జరిగిగిన అత్యాచారమే ఇందుకు నిదర్శనమని అన్నారు.ఇకముందు ఇలాంటివి జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఇలాగే పోరాటాలు చేస్తుందన్నారు జానా రెడ్డి. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని ...అవసరమైతే ఉరి తీసే చట్టాలు తీసుకురావాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

tags: Utham kumar reddy, shabbier ali, jana reddy, rapist mla, pm modi, Jammu rape case, women attacks, cmkcr, peoples plaza, indiramma satue, candle light raly, protest.

Related Post