నాడు భారత్-పాక్ లా యుద్ధమన్నావు .. ఇప్పుడెలా వస్తావు

news02 June 17, 2019, 10:33 a.m. political

Kaleshwaram

అమరావతి : తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కం నిర్మిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఈ నెల 21న జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ‌్నవీస్‌ ను ఆహ్వానిస్తున్నారు. వీరిద్దరిని ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం జరగకుండా అడ్డుకొని తెలంగాణకు నష్టం చేసిన ఫడ్నవిస్ ను ఎలా ఆహ్వానిస్తారనేది మొదటి ప్రశ్న. ఇక రెండోది జగన్ ఇష్యు.

Kaleshwaram

జ‌గ‌న్ ను ఆహ్వానించడంలో రెండు అంశాలను ఎత్తి చూపుతోంది కాంగ్రెస్. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. కేసీఆర్ స‌ర్కార్ ఏర్ప‌డ్డాక ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును త‌ప్పుప‌ట్టి రీడిజైనింగ్ చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో నిర్మాణం చేప‌ట్టారు.ఇప్పుడు ఇదే అంశాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క తెర‌పైకి తీసుకువ‌చ్చారు. 

Kaleshwaram

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి జ‌గ‌న్ వ‌స్తే త‌న తండ్రి వైఎస్ఆర్‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని అంటున్నారు. ప్రాణహిత - చేవెళ్ల నిర్మించాల‌నుకున్న వైఎస్ నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ త‌ప్పుబ‌ట్టిన‌ట్లేన‌ని మెలిక పెడుతున్నారు. ఇక‌ మూడేళ్ల క్రితం తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తూ జ‌గ‌న్ మూడురోజుల పాటు జ‌ల‌దీక్ష చేశారు. ఆ పేపర్ క‌టింగ్‌లు, దీక్ష‌లో జ‌గ‌న్ ఈ ప్రాజెక్ట్ కడితే ఇండియా పాకిస్థాన్ లాగా యుద్ధమేనంటూ చేసిన ప్ర‌సంగాన్ని బాగా వైర‌ల్ చేస్తున్నారు.

Kaleshwaram

ఇక‌ తెలుగుదేశం పార్టీ సైతం ఇవే విమ‌ర్శ‌లు ప్రారంభించే అవ‌కాశం ఉంది. అయితే, విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ఉన్నా కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి ఆహ్వానించ‌నున్నందున‌, తెలంగాణ‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నందున ఈ కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

Kaleshwaram

కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను టీఆర్ఎస్ ఖండిస్తోంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉంటే ఇరువురికీ మంచిద‌నేది టీఆర్ఎస్ వాద‌న‌. మ‌రి ఇటువంటి జ‌గ‌న్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి హాజ‌రై ఈ విమ‌ర్శ‌ల‌కు ఎలా స‌మాధానం ఇస్తారో చూడాలి

Kaleshwaram

tags: AP CM, JAGAN MOHAN REDDY, KCR,KALESHWARAM PROJECT , MAHARASTRA CM, TELANGANA GOVERNMENT, TELANGANA PROJECT,CLP LEADER,MALLU BHATTI VIKRAMARKA, UTTAM KUMAR REDDY, REVANTH REDDY, GANDHIBHAVAN

Related Post