క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కేటీఆర్ మ‌న‌సులో మాట‌

news02 May 12, 2018, 8:49 p.m. political

Minister ktr

హైద‌రాబాద్ ః కర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దేశ మంతా ఎంత ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుందో అంద‌రికి తెలిసిందే. శ‌నివారం మ‌ద్యాహ్నం నుంచే
ఎగ్జిట్ పోల్ ల కోసం అంద‌రు ఎదురు చూస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ పై ఏ టీవీ చాన‌ల్ ఏం చెబుతుందా అని ఎదురు చూశార‌ట‌. అన్ని టీవీల ఎగ్జిట్ పోల్స్ ను చూసిన త‌ర్వాత మంత్రి కేటీఆర్ త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.

Ktr tweet

ఎగ్జిట్ పోల్ చూస్తుంటే అంతా గంద‌ర‌గోళంగా ఉంద‌ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ చూస్తుంటే అర్థం చేసుకోవ‌టం క‌ష్టంగా ఉంద‌ట‌. రెండు ఇంగ్లీష్ చాన‌ల్స్ బీజేపీ గెలుస్తుంద‌ని.. మ‌రి కొన్ని కాంగ్రెస్ గెలుస్తుంద‌ని చూపిస్తున్నారు ట్వీట్ చేశారు. అయితే అన్ని చాన‌ల్స్ లో ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే క‌ర్ణాట‌క‌లో హంగ్ వ‌స్తుంద‌ని అనిపిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క చానల్ ఒక ర‌క‌మైన ఎగ్జిట్ పోల్ ను ఇవ్వ‌టంతో త‌ను గంద‌ర గోళంలో ప‌డిపోయిన‌ట్లు తెలిపారు. 

Related Post