17న ఎమ్మెల్యేలకు సీఎం విందు

news02 Jan. 6, 2019, 6:46 a.m. political

assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన శాసన సభకు ప్రొటెం స్పీకర్‌ గా ఎంఐఎం చార్మినార్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది. 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముంతాజ్ ఖాన్ తో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక 17న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శాసన సభ సమావేశం కానుంది. నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ ప్రమాణం చేయిస్తారు. 

assembly

ఆ తరువాత కొత్త శాసన సభ్యులకు జూబ్లీహాల్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విందు ఇవ్వనున్నారు. అదే రోజు స్పీకర్ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేసి.. ఆ ప్రక్రియలో భాగంగా నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత ప్రొటెం స్పీకర్ ఆయన ఎన్నికను అధికారంగా ప్రకటిస్తారు. ఇక కొత్త స్పీకర్ బాధ్యతలు స్వీకరించి, సమావేశాలు నిర్వహిస్తారు. అంతే కాదు అదే రోజు స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిచీ సమావేశం జరుగుతుంది. 19 తెదీన ఉదయం సభనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారు. దానికి అనుగుణంగా టీఆర్ ఎస్ ప్రభఉత్వం 20వతేదీ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. 
 

tags: assembly, telangana assembly, telangana assembly meetings, ts assembly, ts assembly meetings, telangana assembly speaker, ts assembly new speaker

Related Post