అసలైన దేశ భక్తులం మేమే

news02 March 9, 2019, 9:52 p.m. political

Rahul Gandhi comments in Shamshabad meering

 

హైదరాబాద్ : తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల సమర శంఖాన్ని మోగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీని ఎటాక్ చేశారు. ప్రధాని మోడీ చిన్న వ్యాపారస్తుల ను, ప్రజలను దోచి ..నీరవ్ మోడీకి పెడుతున్నారని మండిపడ్డారు .. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె జీఎస్టీ ని ఓకే ట్యాక్సీ గా చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.చిన్న వ్యారస్థులు ,యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలిస్తామన్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న రాహుల్ గాంధీ.. ప్రజలెవరూ భయపడవద్దనీ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ చెయ్యి ,, పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.

Utham Kumar Reddy met Rahul gandhi

యుపిలోబిజెపి ఎమ్మెల్యే మహిళను అత్యాచారం చేసినా మోడీ ఏమి అనలేదని ఆరోపించారు రాహుల్ గాంధీ.ఎందుకు ఆ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోలేదనీ ప్రశ్నించారు.దేశ భక్తిడినని చెప్పే మోడీ ..రాఫెల్ ల్లో ప్రజా ధనాన్ని దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. డోక్లామ్ లో చైనా ఆర్మీ వస్తే ..మోడీ గుజరాత్ లో చైనా ప్రధానితో చాయ్ తాగుతారనీ ఆరోపించారు.పుల్వామా లో తీవ్రవాదులు అటాక్ చేస్తే ..మోడీ సినిమా షూటింగ్ లో ఉన్నారని దుయ్యబట్టారు. ఇదేనా మోడీ దేశ భక్తి .. అని ప్రశ్నించారు. తెల్లోళ్ళను తరిమిన చరిత్ర కాంగ్రెస్ దన్న రాహుల్ గాంధీ.. మేమెవరిముందు తల వంచం ..మాది నిజమైన దేశ భక్తి అని అన్నారు.అణిచివేత కుమోడీ పాల్పడుతుంటే ..కేసీఆర్ ఆయనకు మద్దతు పలుకుతున్నారని కేసీఆర్ ను టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే .. మహిళ రిజర్వేషన్ బిల్లు తెచ్చి..వారికి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చత్తిస్ ఘడ్ లో తాము చెప్పిన రైతులు ,ఆదివాసుల కిచ్చిన హామీని అమలు చేసి చూపించామని అన్నారు రాహుల్ గాంధీ.

tags: Rahul Gandhi, utham Kumar Reddy , classic garden, Shamshabad function halls, pm Modi, Narendra Modi, loksabha election, Rahul Gandhi on pm Modi,where is Modi at a time Kashmir terror attack.

Related Post