ఆధారాలుంటే బయటపెట్టు పవన్..

news02 Nov. 6, 2018, 7:46 a.m. political

lokesh

జనసేని అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తే అవినీతి మయం చేశారన్న పవన్ వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెంలో రెండు వేల కోట్ల రూపాయల మట్టిన తవ్వారని పవన్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు లేకేశ్. టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలను నిరూపిస్తానని సవాల్ విసిరిన పవన్.. లోకేశ్ వస్తారా అని ప్రశ్నించారు. అంతే కాదు జగన్ ముఖ్యమంత్రి ఐతే ఆంద్రప్రదేశ్ కు మంచి జరగదన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.

lokesh

ఇక పవన్ ఆరోపణలు.. విమర్శలపై మంత్రి లోకేశ్ తనదైన స్టైల్లో స్పందించారు. మోదీ దత్తపుత్రుడిది అంతా అబద్దపు ప్రచారం అని పవన్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో కామెంట్ చేశాడు లోకేష్. అవినీతి అని నోరు చించుకుంటున్న పవన్.. పదవి కోసం తప్పుడు ప్రచారం మానుకని.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరాడు. ప్రధాని మోదీ ఏపీకి తీరని అన్యాయం చేశారని పవన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేధికలో తేలినా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశాడు లోకేష్.  

tags: lokesh, pawan, lokesh fire on pawan, lokesh fire on pawan kalyan, lokesh challenge to pawan, pawan fire on tdp govt

Related Post